
Sunrisers Hyderabad : ఏ జట్టు అయినా ప్లే ఆఫ్ కు చేరాలంటే నెట్ రన్ రేటు చాలా కీలకం. అయితే ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేటు భారీగా పడిపోయింది. భువనేశ్వర్ సారధ్యంలో ఒక మ్యాచ్ లో ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. దీంతో నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. అయితే, ప్లే ఆప్స్ కు చేరుకునే క్రమంలో నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించనుంది. ఈ పడిపోయిన నెట్ రన్ రేట్ పెంచుకోవడం కొత్తగా జట్టుతో చేరిన సారథి మార్క్రమ్ పైనే ఆధారపడి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023 సేజన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవంగా ఆరంభించింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఆరంభ పోరులో సన్రైజర్స్ ఏకంగా 72 పరుగులు తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన షాక్కు సన్ రైజర్స్ హైదరాబాద్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. భారీ తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ మైనస్ లోకి చేరుకుంది. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్ రేట్ -3600 గా ఉంది. పాయింట్లు పట్టికలో ప్రస్తుతం ఈ జట్టు ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.
ప్లే ఆఫ్ కు చేరాలంటే నెట్ రన్ రేట్ కీలకం..
ఏ జట్టైనా ప్లే ఆఫ్ కు చేరాలంటే నెట్ రన్ రేట్ అత్యంత కీలకము. నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించనుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ విషయంలో బాగా వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలం అయిన ఈ జట్టు నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. ఇకపోతే భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా, బౌలర్గా దారుణంగా విఫలం అయ్యాడు. తొలి మ్యాచ్ ఓటమితో డేలా పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. నెదర్లాండ్స్ తో మూడు మ్యాచ్లు వన్డే మ్యాచ్ ను ముగించుకున్న సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఏయిడేన్ మార్క్రమ్, క్లాసెన్, మార్కో యాన్సెన్ లు ఇండియాలో అడుగుపెట్టారు. దీంతో ఈ జట్టు ప్రస్తుతం బలం పెరిగినట్లు అయింది.
కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్న మార్క్రమ్..
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ సీజన్ కెప్టెన్ గా మార్క్రమ్ వ్యవహరించనున్నాడు. మూడో వన్డేలో మార్కమ్ 175 పరుగులతో చెలరేగాడు. ఈ మ్యాచ్ అనంతరం క్షణం కూడా ఆలస్యం చేయకుండా మార్క్రమ్, క్లాసెన్, మార్కో యాన్సెన్లు ఇండియాకు బయలుదేరారు. వీళ్ళు ముగ్గురు కలిసి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసినట్టు హైదరాబాద్ టీమ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ట్వీట్ తో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అన్నొచ్చాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈనెల 7న లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్..
ఇకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తదుపరి మ్యాచ్ ను ఈనెల 7వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ నుంచి మార్క్రమ్ జట్టుకు సారధిగా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికా అండర్ 19 జట్టును మార్గం ప్రపంచ ఛాంపియన్ గా అంతేకాకుండా ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా t20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ను ఛాంపియన్ గా నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించాడు నిలబెట్టాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు మార్క్రమ్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
అరవీర భయంకరమైన బ్యాటింగ్..
ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేయగలడు. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా మార్క్రమ్ సొంతం. బౌలర్ ఎవరైనా ధాటిగా ఆడగల సామర్థ్యం ఉంది. కెప్టెన్ గాను జట్టును విజయ తీరాలకు చేర్చగల సమర్థత ఉందని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులతో పాటు యాజమాన్యం కూడా భావిస్తుంది. మరి ముఖ్యంగా మార్క్రమ్ టీమ్ లో చేరిన తర్వాత జట్టు తలరాత మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. నెట్ రన్ రేట్ సాధారణ స్థితికి రావాలంటే ఈ బ్యాటర్ విజృంభించాల్సిన అవసరం ఈ జట్టుకు ఎంతో ఉంది.
Revisiting that arrival scenes in the morning that made us go: 😍🤩🥳@AidzMarkram | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/EPzqr8s6No
— SunRisers Hyderabad (@SunRisers) April 4, 2023