
Balakrishna-Anil Ravipudi movie : టాలీవుడ్ లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మామూలు ఊపు లో లేదు.ఈయన స్పీడ్ ని అందుకోవడం నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యపడడం లేదు.ఎవరికైనా వయసు అయ్యేకొద్దీ క్రేజ్ తగ్గిపోతూ వస్తాది, కానీ ఇక్కడ బాలకృష్ణ విషయం లో అది పూర్తి విరుద్ధం.ఈయనకి వయసు అయ్యే కొద్దీ క్రేజ్ పెరిగిపోతూ వెళ్తుంది.
గత ఏడాది అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య, ఈ ఏడాది సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో మరో సూపర్ హిట్ ని అందుకొని నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపాడు.ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ప్రముఖ యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ, బాలయ్య బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోయింది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.రీసెంట్ గానే ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది, ఇక టాలీవుడ్ యంగ్ బ్యూటీ, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ చిత్రం లో బాలయ్య బాబు కి కూతురుగా నటిస్తుందని గత కొంతకాలం గా సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుండేది.అయితే ఇక్కడే భారీ ట్విస్ట్ ఉంటుందట.సినిమాలో శ్రీలీల స్క్రీన్ పై బాలయ్య కూతురు గానే కనిపిస్తుంది కానీ , అసలు ట్విస్ట్ మాత్రం ఆమె కూతురు కాదట.బాలయ్య బాబు కి శరత్ కుమార్ అన్నయ్య గా నటిస్తున్నాడు.ఆయన కూతురుగా శ్రీలీల కనిపిస్తుందట.
కొన్ని కారణాల వల్ల శరత్ కుమార్ చనిపోవడం తో బాలయ్య శ్రీలీల ని తన సొంత కూతురులాగా పెంచుకుంటాడట.ఈ ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రెవీల్ చెయ్యకుండా నిజంగా బాలయ్య కూతురు శ్రీలీల అనే ప్రేక్షకులు అనుకుంటారట, ఆ ఫీలింగ్ ని కలుగచేసే విధంగానే స్క్రీన్ ప్లే రాసుకున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఎమోషన్స్ సరిగ్గా పండితే బాక్స్ ఆఫీస్ మరోసారి షేక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.