Summer Tips: మండుతున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలుల సమయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలని, దాహం కాకపోయినా నీళ్లు తాగాలని పేర్కొంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 22, 2024 5:31 pm

Summer heat waves 2024

Follow us on

Summer Tips: భానుడు భగ్గుమంటున్నాడు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నాలుగు రోజులు వాతావరణం చల్లబడినా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాతున్నాయి. ఇక అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు మరీ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రనకటించింది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలుల సమయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలని, దాహం కాకపోయినా నీళ్లు తాగాలని పేర్కొంటున్నారు.

ఇవీ జాగ్రత్తలు..
– బయటకు వెళ్లేప్పుడు తాగునీరు కచ్చితంగా తీసుకెళ్లాలి. ఓరల్‌ రీౖహె డ్రేషన్‌ సొల్యూషన్‌(ఓఆర్‌ఎస్‌)ను వినియోగించాలి. నిమ్మరసం, మజ్జిగ, లీస్సీ వంటి ఇంట్లో తయారు చేసిన పారీయాలు తాగాలి. ఉప్పు కలిపిన పండ్లల రసాలు తీసుకోవాలి. పుచ్చ, కర్జూజా, ఆరంజ్, ద్రాక్ష వంటివి ఎక్కువగా తీసుకోవాలి. సీజనల్‌ పండ్లు, కూరగాయలను తినాలి. పైనాపిల్, దోసకాయ, పాలకూర, పండ్లు, కూరగాయలు తినాలి. మాంసానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్, టీ, కాఫీలు తాగొద్దు.

– ఇక దుస్తులు సన్నని వదులుగా ఉండే కాట¯న్‌ వస్త్రాలను ధరించడం మంచిది. గొడుగు, టోపీ, టవల్‌ వంటి ఇతర సంప్రదాయ పద్ధతుల్లో తలను ఎండ వేడి నుంచి రక్షించుకోవాలి. ఇక మధ్యాహ‍్నం వేళలో బయటకు వెళ్లినప్పుడు షూ లేదా చెప్పులు తప్పకుండా వేసుకోవాలి.

– బాగా వెంటిలేషన్‌ ఉన్న చల్లని ప్రదేశాల్లో ఉం­డాలి. ప్రత్యక్ష సూర్యకాంతి, వేడి గాలులను నిరోధించాలి. పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి.

– ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లాలి.

– అనారోగ్యంతో ఉన్నవారు ఎండాకాలంఒలో ఇతరులకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అదనపు శ్రద్ధ తీసుకోవాలి. శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

– ఇళ్లలో ఒంటరిగా ఉండే వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. వారిని నిత్యం పర్యవేక్షించాలి.

– శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, తడిబట్టలను ఉపయోగించాలి.

– ఇక వేడి ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళలో బయటకు రావొద్దు. అత్యవసరమై వచ్చినా ఎండలో పనులు చేయకూడదు.

– తీవ్రమైన ఎండ సమయంలో వంట గదిలో వంట చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే వంటిల్లు వెంటిలేష¯Œ తో ఉండాలి. వెంటిలేట్‌ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవాలి.

– వేసవిలో ఆల్కహాల్‌, టీ, కాఫీ, కూల్‌ డ్రింక్స్‌, ఎక్కువగా చక్కెర ఉండే పానీయాలు తీసుకోకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్‌ చేస్తాయి. కడుపులో తిమ్మిరికి కారణమవుతాయి.

– ఇక ఆరుబయట పనిచేసే కూలీలు, కార్మికులు పని ప్రదేశంలో చల్లని తాగునీటిరు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతీ 20 నిమిషాలకు గ్లాసు నీళ్లు తాగాలి. దాహం వేయకున్నా నీళ్తు తాగాలి.

– సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 97.5ని ఫారిన్‌ హీట్‌ నుంచి 98.9ని ఫారీన్‌ హీట్‌ ఉండాలి.