Summer Honeymoon Trip : ప్రస్తుతం పెళ్లిలో సీజన్ నడుస్తోంది. మే నెలలో చాలావరకు శుభకార్యాలు నిర్వహించనున్నారు. వీటిలో ఎక్కువగా పెళ్లిల్లే జరగనున్నాయి. అయితే పెళ్లి జరిగిన తర్వాత కొత్తజంట సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇందుకోసం ప్రైవసీ కోరుకుంటుంది. అయితే ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండ మండిపోతుంది. ఇలాంటి సమయంలో చల్లని ప్రదేశాలకు వెళ్లి హాయిగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం దేశంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్లి సంతోషంగా గడపవచ్చు. ఆ ప్రదేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
వేసవికాలంలో మండే ఎండల్లోనూ అత్యంత చల్లదనం ఇచ్చే ప్రదేశం ఊటీ. తమిళనాడు రాష్ట్రంలోని క్వీన్ ఆఫ్ ది హిల్స్ గా పేర్కొనబడే ఈ ప్రదేశంలో నీలగిరి పర్వతాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇక్కడికి కొత్త జంటలు వెళ్లి మధురానుభూతి పొందవచ్చు. నీలగిరి పర్వత రైలు, బొటానికల్ గార్డెన్, పైకార సరస్సు, దొడ్డబెట్ట శిఖరం వంటివి ఇక్కడ సందర్శించి సంతోషంగా గడపవచ్చు. ఏప్రిల్ నుంచి మే నెలలో ఇక్కడ 12 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది.
Also Read : వేసవిలో బయటకు వెళ్లకున్నా తలనొప్పి వచ్చేస్తుందా.. అది భయంకర మైగ్రేన్ గా మారొచ్చు..
తమిళనాడు రాష్ట్రంలోనే వేసవికాలంలో చల్లని వాతావరణం ఇచ్చే మరో ప్రదేశం కొడైకెనాల్. ఇక్కడ ఉండే కొండలు మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. హనీమూన్ కు గమ్యస్థానంగా పేర్కొనబడే ఈ ప్రదేశం చల్లని గాలులతో మంచి వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ వేసవిలో 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ప్రదేశంలో గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్, వేర్ షోలా జలపాతం ఆకర్షిస్తుంది.
ఉత్తర భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్లో వేసవి ప్రాంతంలో చల్లగా ఉంటుంది. ఇక్కడ మనాలి హిమాలయాల్లో ఒక అందమైన హిల్ స్టేషన్ గా పేర్కొంటారు. ఇక్కడ రోప్ సాంగ్ పాస్, హడింబా దేవాలయం, సోలాంగ్ వాలి వంటి ప్రదేశాలను చూడవచ్చు. వేసవిలో ఇక్కడ 10 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదు అవుతుంది. వేసవి పూర్తయ్య వరకు ఇక్కడే ఉండి ఆనందంగా గడపవచ్చు.
హిమాచల్ ప్రదేశ్ లోనే సిమ్లా ప్రాంతం చల్లని వాతావరణాన్ని అందిస్తుంది. ఆకుపచ్చని కొండలతో మనసుకు ఉల్లాసాన్ని అందిస్తుంది. ఇక్కడ రిడ్జ్ నుంచి సూర్యాస్తమయం చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. సిమ్లా టాయ్ ట్రైన్ ప్రయాణం ఆకర్షణగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వెళ్లిన ఇక్కడ సంతోషంగా గడపవచ్చు.
పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ వేసవికాలంలో మంచి అనుభూతిని అందిస్తుంది. తేయాకు తోటలకు ప్రసిద్ధిగా పొందిన ఇక్కడ కాంచన గంగ శిఖరం దృశ్యం మధురానుభూతిని అందిస్తుంది. టాయ్ ట్రైన్ రైడ్, బౌద్ధమటాలు, స్థానిక మార్కెట్ షాపింగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వేసవిలో ఇక్కడ చల్లటి వాతావరణం ఉండడంతో చాలామంది ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనీటాల్ కూడా వేసవిలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని కొండలతో ఉన్న ఇక్కడి నైని సరస్సులో బోటింగ్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. ఢిల్లీ చండీగఢ్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే వీకెండ్ ట్రిప్ కూడా చాలా ఎంజాయ్ చేయవచ్చు.