spot_img
Homeలైఫ్ స్టైల్Hair fall causes in summer: వేసవిలో జుట్టు పీక్కోవాల్సిన సమస్య ఇది.. నిర్లక్ష్యం చేయకండి.....

Hair fall causes in summer: వేసవిలో జుట్టు పీక్కోవాల్సిన సమస్య ఇది.. నిర్లక్ష్యం చేయకండి.. ఆ తర్వాత చింతించి లాభం లేదు

Hair fall causes in summer: ఒక మనిషికి అందాన్ని కలిగించే వాటిల్లో ముఖ్యపాత్ర పోషిస్తాయి వెంట్రుకలు. ఆడవాళ్ళకైనా.. మగవాళ్ళకైనా వెంట్రుకలే అందాన్ని కలిగిస్తాయి. మనదేశంలో చాలామంది తెల్ల వెంట్రుకలు వస్తేనే సహించలేరు. ఎప్పటికప్పుడు రంగులు వేసుకుంటూ.. ఆ నలుపు దనాన్ని కాపాడుకుంటూ ఉంటారు. పదిమందిలో తెలుపుదనాన్ని చూపించడానికి ఇష్టపడరు.

తెల్ల వెంట్రుకలు వస్తేనే తట్టుకోలేని మన సమాజంలో.. వెంట్రుకలు ఊడిపోతే ఎలా ఉంటుంది.. అలా ఊడిపోయిన వారి బాధ మామూలుగా ఉండదు. వెంట్రుకలు ఊడిపోయి బట్ట తల వచ్చిన వారు.. పడే బాధలు మామూలుగా ఉండదు. కొందరైతే క్యాప్ పెట్టి కవర్ చేస్తారు. ఇంకొందరైతే భారీగా ఖర్చుపెట్టి మళ్లీ వెంట్రుకలను మొలిపించుకుంటారు. ఇది భారీగా ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ నలుగురిలో తమ బట్టతలను చూపించడానికి ఇష్టపడని వారు.. ఇంత ఖర్చైనా సరే వెంట్రుకలు మొలిపించుకుంటారు. దీనికోసం వైద్యులు చెప్పిన నిబంధనలను మొత్తం పాటిస్తారు.

వాస్తవానికి జుట్టు రాలిపోవడం అనేది అనేక రకాలుగా ఉంటుంది. కాలుష్యం, జన్యుపరమైన కారణాలు, వాతావరణం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. వేసవికాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు.. వేసవికాలంలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రత. దీనిని తగ్గించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళేటప్పుడు తలకు వస్త్రం చుట్టుకోవాలని.. క్యాప్ తో కవర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనెను కుదుళ్ల దాకా పట్టించాలని.. అవసరమైతే మర్దన చేయాలని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చటి నేటితో మాత్రమే తలస్నానం చేయాలని.. రసాయనాలు లేని సాధారణ కండీషనర్ షాంపులు వాడాలని చెబుతున్నారు. ఎండాకాలంలో బాడీ డిహైడ్రేషన్ కు గురికాకుండా ఉండడానికి రోజు మూడు లీడర్ల నీళ్లను తాగాలని చెబుతున్నారు. ఆకుకూరలను.. పండ్లను తినాలని సూచిస్తున్నారు. స్టైల్ కోసం హీటింగ్ డివైస్ వాడితే ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

“ఎండాకాలంలో జుట్టు రాలడం అనేది మొదలైన తర్వాత అది ఎక్కడ దాకైనా దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో వేరే వేరే సమస్యలు కూడా రావచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. తాగే నీటి నుంచి మొదలు పెడితే తినే తిండి వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వెంట్రుకలు దృఢంగా ఉంటాయి. సాధ్యమైనంతవరకు పొల్యూషన్ లో తిరగకూడదు. అవసరమైతే నీడ పట్టున ఉండాలి. అత్యంత అవసరమైతేనే బయటికి వెళ్లాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా ప్రయోగాలు చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుందని” నిపుణులు చెబుతున్నారు.

గమనిక
ఈ కథనం ఓకే తెలుగు పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే.. వివిధ వేదికల వద్ద ఈ సమాచారాన్ని సేకరించాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాచారం వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని పాఠకులు గుర్తుంచుకోవాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version