Duvvada Srinivas no chance: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసింది. వ్యక్తిగత కుటుంబ వ్యవహార శైలితో పార్టీ ఆయనను దూరం పెట్టింది. అయితే ఆయన తిరిగి వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి వర్కౌట్ అయ్యేలా లేవు. ధర్మాన సోదరులతో పాటు దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులంతా దువ్వాడ శ్రీనివాసుని వ్యతిరేకిస్తున్నారు. సామాజిక వర్గ కోణంలో చూపి తమ్మినేని సీతారాం ద్వారా ప్రయత్నాలు చేశారు దువ్వాడ. కానీ ఆ ప్రయత్నలేవి వర్కౌట్ కాలేదు. దీనికి తోడు దువ్వాడ శ్రీనివాస్ వాణి ఇప్పుడు వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తద్వారా దువ్వాడ శ్రీనివాస్ దూకుడుకు ఆమె బ్రేక్ వేసినట్టు కనిపిస్తున్నారు. జిల్లా పార్టీ పెద్దల ప్రోత్సాహంతోనే ఆమె యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పెద్దలపై రగిలిపోతున్నట్లు సమాచారం.
రాజకీయ నేపథ్య కుటుంబం..
దువ్వాడ వాణి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఒక విధంగా వాణి కుటుంబం వల్లే దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పేరు వచ్చింది. టెక్కలి ఎంపీపీ తో పాటు జడ్పిటిసి గా కూడా ఉన్నారు వాణి. మొన్నటి ఎన్నికల్లో ఆమెకు ముందుగా టికెట్ ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కానీ చివరి నిమిషంలో దువ్వాడ శ్రీనివాస్ కు ఇచ్చారు. అయితే ఎన్నికల అనంతరం దువ్వాడ కుటుంబంలో రేగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లోనే వాణి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. అయితే ఆ నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేశారు. అయితే తిరిగి పార్టీలోకి దువ్వాడ చేరుతానని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ధర్మాన సోదరులపై మాత్రం అనుచిత వ్యాఖ్యలు తగ్గించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ కు చెక్ చెప్పేందుకు దువ్వాడ వాణి రంగంలోకి దిగారు.
కొన్ని రకాల ఒప్పందాలతోనే..
దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన క్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు వాణికి అప్పగిస్తారని అంత ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా పేరాడ తిలక్ కు ఇచ్చారు. అయినా సరే దువ్వాడ వాణి జిల్లా వైసీపీ పెద్దలతో మంచి సంబంధాలు నడుపుతూ వచ్చారు. అయితే టెక్కలిలో కింజరాపు అచ్చెనాయుడుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిపారని.. దిష్టిబొమ్మను దహనం చేశారని పోలీసులు పేరాడ తిలక్ ను అరెస్టు చేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలు టెక్కలిలో ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట వాణి బైఠాయించారు కూడా. టెక్కలి వైసీపీలో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ కు ఛాన్స్ ఇవ్వకూడదని.. ఆయనను తిరిగి పార్టీలో చేర్చకూడదని.. టెక్కలిలో తిలక్ ను గెలిపిస్తే నామినేటెడ్ పోస్టు వాణికి ఇస్తామన్న ఆఫర్ తోనే ఆమె యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె సైతం దువ్వాడ శ్రీనివాసును పొలిటికల్ గా క్లోజ్ చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
