Sukanya Samriddhi Yojana
Sukanya Samriddhi Yojana: ఆడబిడ్డ పుట్టింది అంటే భారంగా భావించే రోజులు ఇవి. పేద, మధ్య తరగతి ప్రజల్లో ఈ భావన ఇప్పటికీ ఉంది. దీంతో ఆడపిల్లల సంరక్షణకు ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రారంభిస్తున్నాయి. ప్రజలను పొదుపువైపు నడిపించేలా స్కీంలు లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను ప్రారంభించింది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఆడ పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇచ్చేలా ఈ స్కీమ్ రూపకల్పన జరిగింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా బిడ్డ పెళ్లి నాటికి ఈజీగా లక్షల్లో డబ్బు కూడబెట్టవచ్చు. పిల్లలు పెద్దవారైన తర్వాత వారి ఉన్నత చదువులతోపాటు పెళ్లి అవసరాలకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని డిజైన్ చేసింది.
లాంగ్ టర్మ్‌లో లక్షల పొదుపు..
ఈ పథకంలో ప్రతినెలా కొంత మొత్తం పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్‌లో లక్షల రూపాయలు పొదుపు చేయవచ్చు. ఇందులో ఏడాదికి కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 15 ఏళ్ల వరకు ఈ పెట్టుబడి కొనసాగించాలి. ఆ తర్వాత ఆరేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మీ మొత్తం సొమ్ము రిలీజ్ అవుతుంది. ఆడపిల్ల పుట్టిన మొదటి రోజు నుంచి ఆ బిడ్డకు పదేళ్లు వచ్చేలోపు ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. పదేళ్లు దాటిన ఆడపిల్లలకు ఇది వర్తించదు.
గరిష్ట వడ్డీ..
ఇక నెలనెలా పెట్టే పెట్టుబడిపై గరిష్ట వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్‌లో 8 శాతం వడ్డీ ఇస్తున్నారు. వడ్డీ అంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్‌గా క్యాలూకిలేట్ కావడం వల్ల మెచ్యూరిటీ నాటికి భారీ సొమ్ము పోగవుతుంది. ఇది ఆడబిడ్డ భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
పుట్టగానే పెట్టుబడి పెడితే..
బిడ్డ పుట్టగానే ఓ ప్లాన్ ప్రకారం ఈ స్కీంలో పెట్టుబడి పెడితే బిడ్డ పెళ్లి నాటికి లక్షలు, కోట్లు కూడబెట్టవచ్చు. ఉదాహరణకు బిడ్డ పుట్టిన వెంటనే ఆమె పేరిట సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరి నెలకు రూ.5 వేల పెట్టుబడి పెడితే 21 ఏళ్లకు రూ.27 లక్షలు అందుకోవచ్చు. నెలకు రూ.5 వేలు పెడితే సంవత్సరానికి రూ.60 వేలు అవుతుంది. 15 ఏళ్లు పెడితే రూ.9 లక్షలు అవుతుంది. ఆరేళ్ల లాకిన్ పీరియడ్‌లో పెట్టుబడి పెడితే ఈ మొత్తానికి 8 శాతం చొప్పున చక్ర వడ్డీ రావడం వస్తుంది. దీంతో రూ.9 లక్షలకు రూ.17,93,814 జమ అవుతుంది. వడ్డీ యాడ్ అయి మెచ్యూరిటీ నాటికి రూ.26,93,814 వస్తుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sukanya samriddhi yojana scheme telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com