Husband And Wife Relationship: రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలంటారు. మనం చేసే పనిలో అంకితభావం ఉండాలి కానీ సమయమంతా అదే పనిలో గడిపితే కష్టమే. ఏ పని చేసేటప్పుడు ఆ ధ్యాస ఉండాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తల బంధం కూడా అలాంటిదే. జీవిత భాగస్వామికి తగిన సమయం కేటాయించాలి. అంటే మనం ఏకాంతంగా ఉండే బెడ్ రూంలో ఒకరి గురించి మరొకరు మనసు విప్పి మాట్లాడుకుంటే మంచిదే. సమస్యలు దూరమవుతాయి. కష్టసుఖాల తెలుస్తాయి. సంసారంలో ఉన్న సమస్యల పరిష్కారానికి చక్కని మార్గమే పడకగది. పడక గది అంటే ఆలుమగల సామ్రాజ్యమే. ఏకాంతంగా ఉంటాం కాబట్టి ఎన్నో విషయాలు చర్చించుకుంటే మనసు హాయిగా అనిపిస్తుంది.

ఉరుకుల పరుగుల కాలంలో అందరు డబ్బు సంపాదనకే ప్రాధాన్యం ఇస్తున్నారు. బెడ్ రూంలో చేసుకోవాల్సిన శృంగారం గురించి మరిచే పోతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుంటూ ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటూ సంసారమనే బంధంలో నావలో ముందుకెళ్లాలి. భార్య కోరికను తీర్చడం భర్త ధర్మం. పెళ్లినాడే ప్రమాణం చేస్తాం కదా. అర్థేశా మోక్షశా కామేశా నాతిచరామి అని అవసరాల్లో కోరికల్లో ఆర్థిక విషయాల్లో తోడుంటానని ప్రమాణం చేయడంతో ఆమెను బాగా చూసుకునే బాధ్యత భర్తపై ఉంటుంది.
యాంత్రిక జీవనంలో అన్ని యంత్రంలా మారిపోయాయి. ప్రేమలు ఉండటం లేదు. అనురాగం, ఆప్యాయత అనేవి కనిపించడం లేదు. ఎంతసేపు సంపాదన మీదే ఆశ. దాని మీదే ధ్యాస. దీంతో కుటుంబాల్లో గొడవలు కూడా వస్తున్నాయి. డబ్బు ఒక్కటే జీవితానికి అవసరం కాదు. అన్ని విషయాలు సమపాళ్లలో ఉంటేనే సంసారం. దీనికి మనం చేయాల్సిందల్లా భార్యను సంతోషపెట్టడమే. ఆమె కూడా మనిషే కదా. కోరికలు ఉంటాయని తెలిసినా ప్రస్తుతం ఆ ఆలోచనలకు దూరంగా ఉంటే కష్టమే. వారి మనసు తెలుసుకుని మసలుకోవాలి.

పొరపాటున కూడా కార్యాలయ విషయాలు ఇంట్లో చర్చించకండి. ఎందుకంటే మన ఇబ్బందులు మనం పడాలి. కానీ ఇంట్లో వారి మీద రుద్దితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. మనం ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటాం. వాటిని కుటుంబ సభ్యుల మీద ఆపాదిస్తే కుదరదు. పడక గదిలో కూర్చున్నప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి. అవసరమైతే శృంగారంలో పాల్గొంటే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనురాగం వెల్లివిరుస్తుంది. ఇద్దరి మధ్య మంచి సన్నిహితం కుదురుతుంది. ఇవి తెలుసుకుంటే ఎవరు కూడా సంసారాన్ని కకావికలం చేసుకోరు. ఈ చిన్న చిట్కాను ఉపయోగించుకుని ఆలుమగలు అరమరికలు లేని విధంగా సంసారం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.