Stream Without Subscription: ఇంట్లోనే ఉండి కావాల్సిన సినిమా చూస్తే సౌకర్యాలు ఉన్న రోజులు ఇవి. ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి థియేటర్లోకి వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి ఉంటే.. ఇప్పుడు కొన్ని యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకుని ఇంట్లోనే ఫ్యామిలీతో సహా సినిమాలు చూసే అవకాశం వచ్చింది. వీటిల్లో సన్ నెక్స్ట్, నెట్ ఫిక్స్, అమెజాన్, డిస్నీ హాట్ స్టార్ వంటి వి ప్రముఖంగా ఉన్నాయి. అయితే ఈ యాప్స్ ద్వారా సినిమాలో చూడాలంటే వాటికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదే నెల నెల లేదా ఏడాదికి ఒకేసారి చెల్లించి కావాల్సిన సినిమాలను చూసుకోవచ్చు. అయితే ఒక గ్రూపులో ఒకరు ఏదైనా యాప్ కు సబ్స్క్రైబర్ గా మారిన తర్వాత వారి దగ్గరి మిత్రులు లేదా బంధువులకు పాస్వర్డ్ లను షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు ఈ పాస్వర్డ్ లను షేర్ చేయడానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు ఇతరులను పాస్వర్డ్ లను అడగకుండానే ఉచితంగా సినిమాలు చూసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అది ఎలాగంటే?
థియేటర్లో ఒక సినిమా చూసే ఖర్చుతో ఓటిటి ద్వారా పదులకొద్దీ సినిమాలను చూడొచ్చు. అయితే ఈ అవకాశం పొందాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొందరు ఈ ప్రీమియం కూడా చెల్లించకుండా ఉచితంగా సినిమాలు చూడాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో తమ బంధువు లేదా మిత్రుడు వద్ద పాస్వర్డ్ తీసుకుని ఉచితంగా సినిమాలు చూస్తుంటారు. అయితే ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్స్ ద్వారా ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఓటీపీ సినిమాలో చూడొచ్చు.
ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ లోని సినిమాలను చూడాలని అనుకుంటే ‘ నెట్ మిర్రర్’ అనే యాప్ లో చూడొచ్చు. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు బదులుగా ‘క్యాస్టల్’ అనే యాప్ ఉపయోగించుకోవచ్చు. చాట్ జిపిటి అనే యాప్ కు ప్రత్యామ్నాయంగా కో పైలట్, ప్రీమియర్ ప్రో కు బదులుగా క్యాప్కట్ అనే యాప్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి చెల్లించకుండానే ఉచితంగా కావాల్సిన సినిమాలను చూడవచ్చు. ఇప్పటికే కొన్ని వెబ్సైట్లో ద్వారా థియేటర్లకు వచ్చిన సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిలో ఉండే ప్రింటు మసకబారినట్లు కనిపిస్తుంది. కానీ ఈ యాప్స్ లో డ్యూటీలో ఉంటే కాపీలే ఉండడంతో ఒరిజినల్ కంటెంట్ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
అందువల్ల ott లకు ప్రీమియం చెల్లించలేని వారు ఆయా యాప్స్ ను డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా కావాల్సిన సినిమాలను చూడవచ్చును. ప్రతి యూత్ గ్యాంగ్ లో ఒక ఫ్రెండ్ ఏదైనా ఒక యాప్ను కొనుగోలు చేసి ఇతరులకు పాస్వర్డ్ షేర్ చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ఎవరికి వారు సొంతంగా కావలసింది చూసే అవకాశం ఈ యాప్స్ కలిగిస్తున్నాయి.