South Monsoon 2025 Update: నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. గత కొద్దిరోజులుగా వాటి కదలిక నిలిచిపోవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వేడి వాతావరణం కొనసాగింది. అయితే ఇప్పుడు రుతుపవనాల కదలిక ప్రారంభం అయింది. వాటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో( South States) వాతావరణం మారుతోంది. ఏపీలో చల్లటి వాతావరణం నెలకొంది. ఆకాశం మేఘావృతం అయింది. ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా పేర్కొంది. మరోవైపు కేరళ, కర్ణాటకలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో సైతం భారీ వర్షాల బీభత్సం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో అకాల వర్షాలకు 18 మంది చనిపోయారు కూడా. కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే క్రమేపి ఏపీకి సైతం వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Biryani Leaves Farming : బిర్యానీ ఆకుతో కోట్లు! సిరులు కురిపిస్తున్న ఈ పంటల గురించి తెలుసా?
ఉపరితల ఆవర్తనం.
మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో( day of Bengal ) ఒక ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాల జోరు పెరగనుండడంతో ఏపీలో సైతం వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రోజంతా మేఘావృతం అయి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు వర్షాలు పడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం బలపడి తుఫాన్ గా మారితే మాత్రం ఏపీకి భారీ వర్ష సూచన ఉంటుంది. అయితే ఇంకా వేడి వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అయితే చాలా ప్రాంతాల్లో మేఘావృతం కావడంతో చల్లటి వాతావరణం ఉంది.
Also Read: AP Government: చెరువుల్లో మట్టి పొలాలకు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!
విపత్తుల కాలం
సాధారణంగా జూన్( June) నుంచి సెప్టెంబర్ వరకు బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా భారీ తుఫాన్లు ఉంటాయని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వరుస విపత్తులతో ఏపీలో తీర ప్రాంతం నష్టపోయింది. మరోసారి ఆ పరిస్థితి వస్తే మాత్రం రైతులతో పాటు మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే దేశానికి తాకాయి. విస్తరించాయి కూడా. ప్రస్తుతం అవి చురుగ్గా కదులుతుండడంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మున్ముందు తెలుగు రాష్ట్రాలకు సైతం భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడితే మాత్రం ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అప్పటివరకు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.