
IT Jobs: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, నీల్ మోహన్… పేరుమోసిన ఐటీ కంపెనీలకు వీళ్లంతా సారథులు. ఎప్పుడో దశాబ్దాల క్రితమే వీరు అమెరికాకు వలస వెళ్లిపోయారు. అసలు ఏ మాత్రం అవకాశాలు లేని చోట కష్టపడి ఉద్యోగాలు సంపాదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని శాసిస్తున్న కంపెనీలను నడిపిస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తు తరానికి సరికొత్త సేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు.. అసలు ఇటువంటి సౌకర్యాలు లేనప్పుడే ఎంతగానో ఎదిగిన వీరు.. ఇప్పటి తరానికి ఆదర్శనీయులు. కానీ ఈ తరం మాత్రం వీరిలా ఎదగలేక పోతోంది. కొంగుబాటుకు గురవుతోంది.
సర్వేలో విస్తు గొలిపే వాస్తవాలు
సిగ్న ఇంటర్నేషనల్ హెల్త్ సర్వీస్ అనే సంస్థ ఇటీవల కొంతమంది ఐటి ఉద్యోగులను సర్వే చేసింది. వీరంతా కూడా 25 సంవత్సరాల లోపు ఉన్నవారే. ఉద్యోగం, జీతభత్యాలు, కుటుంబం, పనిచేస్తున్న ప్రదేశంలో పరిస్థితి, తోటి ఉద్యోగుల తీరు, ప్రాజెక్టులు, జీతాల్లో పెరుగుదల… ఇటువంటి అంశాలపై ప్రశ్నలు వేసింది. ఈ సందర్భంగా పలువురు తమ ఆవేదన వెలిబుచ్చారు.. నూటికి 23 శాతం మంది పని వల్ల తాము ఒత్తిడిరకి గువుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు సరిపోవడం లేదని 90 శాతం మంది తేల్చేశారు. పని ప్రదేశంలో తోటి ఉద్యోగుల తీరు బాగోలేదని 34 శాతం మంది చెప్పారు. ఉద్యోగంలో ఎదుగుదల లేక అనారోగ్యం పాలవుతున్నామని 60 శాతం మంది అన్నారు.
ఇబ్బంది పెడుతోంది
సాంకేతిక పరిజ్ఞానం మన జీవితంలోకి వేగంగా ప్రవేశించిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితాలను నిర్దేశిస్తున్నది. దీనివల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. కోవిడ్ తర్వాత చాలా సంస్థలు ఆటోమేషన్ వైపు వెళ్లిపోవడంతో కొలువులు ఊడిపోయాయి. ఇక ఉన్నవారికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. దీనివల్ల జనరేషన్ జెడ్ తరం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలు పెట్టుకోవడంతో మానసిక సమస్యల బారిన పడుతోంది. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే ఐదు అంకెల జీతం, శని, ఆది వారాల్లో సెలవు. పబ్ లో పార్టీలు, హోటళ్లలో డిన్నర్లు… ఇలా ఉండేది జీవితం. కానీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం వల్ల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎవరికి లే ఆఫ్ వస్తుందో తెలియదు. ఎవరి ఉద్యోగం ఎన్నాళ్లు ఉంటుందో అస్సలు తెలియదు. మొత్తానికి ఈతరం సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితం దినదిన గండంగా మారింది.