https://oktelugu.com/

Social Trends : ఇంతటి టార్చర్ యుగంలో భార్యా బాధిత భర్తలు బతికేదెలా!

Social Trends : ఇటీవల బెంగళూరు నగరంలో అతుల్ సుభాష్ అనే ఐటి ఉద్యోగి భార్య పెట్టే బాధలు తట్టుకోలేక తనువు చాలించాడు. గుజరాత్ రాష్ట్రంలో సురేష్ సథాదియా అనే వ్యక్తి భార్య వేధింపులు భరించలేక కన్నుమూశాడు 498 - ఏ కేసుల వల్ల చాలామంది భర్తలు నలిగిపోతున్నారు. కోర్టుల చుట్టూ తిరగలేక.. అయినవారి నుంచి సహకారం లభించక కన్నుమూస్తున్నారు. సమస్యను ఎదిరించే ధైర్యం లేక చావే శరణ్యం అని భావిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 7, 2025 / 10:20 PM IST
    Social Trends

    Social Trends

    Follow us on

    Social Trends : భర్త అంటే భరించేవాడు అని అర్థం. అయితే ఇప్పటి కాలంలో ఆ భరించే స్తోమత దాటిపోయింది. ఆ బాధలను తట్టుకోలేక.. భార్యలు పెడుతున్న వేధింపులు తాళలేక భర్తలు ఇబ్బంది పడిపోతున్నారు. సంసారం బరువును మోయలేక.. బంధాలను తెంచుకునే ప్రయత్నం చేయక.. తన బతుకులనే త్యాగం చేస్తున్నారు భర్తలు. కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో భార్య బాధితుల బలవన్మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. బాధను పంచుకునే తోడు లేక.. వెక్కిరిస్తున్న సమాజాన్ని తట్టుకోలేక.. అండగా నిలిచే ధైర్యం కనిపించక.. న్యాయపోరాటం చేసే సామర్థ్యం లేక.. చట్టాలను ధిక్కరించే దమ్ము లేక.. మౌనంగా రోదిస్తూ.. చాలామంది భర్తలు తమ తనువులను చాలించుకుంటున్నారు.

    Also Read : చాణక్య నీతి ఆడవారిలో ఈ లక్షణాలు ఉంటే మగవాళ్ళు వెంటనే ఇష్టపడతారు… అవేంటంటే?

    ఇటీవల బెంగళూరు నగరంలో అతుల్ సుభాష్ అనే ఐటి ఉద్యోగి భార్య పెట్టే బాధలు తట్టుకోలేక తనువు చాలించాడు. గుజరాత్ రాష్ట్రంలో సురేష్ సథాదియా అనే వ్యక్తి భార్య వేధింపులు భరించలేక కన్నుమూశాడు 498 – ఏ కేసుల వల్ల చాలామంది భర్తలు నలిగిపోతున్నారు. కోర్టుల చుట్టూ తిరగలేక.. అయినవారి నుంచి సహకారం లభించక కన్నుమూస్తున్నారు. సమస్యను ఎదిరించే ధైర్యం లేక చావే శరణ్యం అని భావిస్తున్నారు. కన్న పిల్లలను ఒంటరి చేసి.. వారు కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. 498 – ఏ కేసుల్లో భర్తే నిందితుడని.. కుటుంబాలలో చోటు చేసుకున్న వివాదాలలో భర్తే రాక్షసుడని.. కుటుంబ కథా చిత్రాలలో భర్త విలన్ అని ఈ సమాజం ఎప్పుడో తీర్మానించింది. అందువల్లే భార్య బాధితులు ఒక్కొక్కరుగా తమ బాధను వెల్లబోసుకుంటున్నారు.

    అతుల్ సుభాష్ ఘటనలో..

    ఏడాది బెంగళూరు నగరానికి చెందిన అతుల్ సుభాష్ అనే ఐడి నిపుణుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక అతడు తన జీవితానికి ఎండ్ కార్డు వేసుకున్నాడు. అతుల్ ఉదంతంతో చాలామంది భార్య బాధితులు వెలుగులోకి వచ్చారు. తమ బాధను బయటకు చెప్పుకున్నారు. ఇక ఈ జాబితాలో హైదరాబాదు నగరానికి చెందిన ఓ యువతీ కూడా ఉంది. ఆమె తన అన్న బాధను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చింది. సమాజం, న్యాయవ్యవస్థ తన అన్నను ఇబ్బంది పెడుతున్నాయని వాపోయింది.. ఆ యువతీ చెప్పిన వివరాల ప్రకారం 2019లో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రొఫెసర్ రాజమండ్రి చెందిన యువతని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన పది రోజులకే ఆ అమ్మాయి రాజమండ్రి వెళ్ళిపోయింది. అక్కడ తన భర్త పై 498 – ఏ కింద కేసు పెట్టింది. అప్పటినుంచి ఆ ప్రొఫెసర్ కు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి ఆ ప్రొఫెసర్ కు ఓపిక నచించింది. దీంతో తన సోదరుడి కష్టాన్ని ఆ యువతి సోషల్ మీడియాలో ఏకరువు పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే భార్యల వల్ల ఇబ్బంది పడుతున్న భర్తలు చాలామంది ఉన్నారు. కాకపోతే సమాజం, న్యాయవ్యవస్థ, కుటుంబ గౌరవాన్ని దాటి రాలేక వారిలో వారు మదనపడుతున్నారు. చివరికి తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. బెంగళూరులో అతుల్ సుభాష్, మరో ప్రాంతంలో పునీత్ ఖురానా, గుజరాత్ రాష్ట్రంలో సురేష్ సతాదియా.. పేర్లు మాత్రమే వేరు.. ప్రాంతాలు మాత్రమే వేరు.. వారిపై జరిగిన వేధింపులు.. పెట్టిన కేసులు మాత్రం ఒకటే.

    Also Read : మీ భాగస్వామిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే వారు విడిపోతారని అర్థం.. ఎలాగంటే?