Phone On Bed: ఫోన్ ను పక్కన పెట్టుకొని పడుకుంటున్నారా?

చాలా మందికి రాత్రి పడుకునే ముందు సెల్ ఫోన్ ను పక్కనే పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలా పెట్టడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. పడుకునే ముందు మొబైల్ ను వేరే రూమ్ లో పెట్టి పడుకోండి.

Written By: Swathi, Updated On : March 23, 2024 2:43 pm

Phone On Bed

Follow us on

Phone On Bed: మొబైల్ మొబైల్ మొబైల్.. అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఈ మొబైల్ లేకుండా నిమిషం గడపడం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సెల్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఫోన్ లు వాడుతున్నారు. మరి ఇలాంటి ఫోన్ వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా? అంతేకాదు మనం నిత్యం ఉపయోగించే లాప్ టాప్ ల వల్ల కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఓ సారి ఆ సమస్యలు ఏంటో చూసేయండి.

చాలా మందికి రాత్రి పడుకునే ముందు సెల్ ఫోన్ ను పక్కనే పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలా పెట్టడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. పడుకునే ముందు మొబైల్ ను వేరే రూమ్ లో పెట్టి పడుకోండి. లేదంటే ఫోన్ ను ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి మరీ పడుకోండి. అంతేకాదు ఇంట్లో ఉన్న వైఫై.. రూటర్ లను కూడా ఆఫ్ చేసి మరీ పడుకోండి. ఎలక్ట్రో మాగ్నెటిక్ ప్రీక్వెన్సీ ఉంటాయి. వీటి వల్లనే వైఫై నెట్ వర్క్ లు పని చేస్తాయి. ఈ డివైజ్ ల నుంచి రిలీజ్ అయ్యే దారుణమైన రేడియేషన్ వల్ల చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

ఈ రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ లు వస్తాయని గతంలోనే హెచ్చరించింది డబ్ల్యూహెచ్ వో. పడుకునే ముందు మొబైల్ చూస్తే దాని నుంచి వచ్చే బ్లూ కలర్ లైట్స్ వల్ల, ఆ లైటింగ్ వల్ల కళ్లకు కూడా ప్రమాదం అని తెలిపారు డాక్టర్లు. అంతేకాదు నిద్రలేమి సమస్య కూడా వస్తుందట. జేబులో కూడా ఫోన్ లను పెట్టుకోవడం, గంటల తరబడి ల్యాప్ లాట్ లను కాళ్ల మీద పెట్టుకోవడం కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అందుకే మొబైల్స్ వల్ల, ల్యాప్ టాప్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

మొబైల్, లాప్ టాప్స్ వల్ల స్పెర్మ్ కౌంటింగ్ కూడా తగ్గుతుందట. దీని వల్ల పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుందట. మరి తెలుసుకున్నారు కదా.. మొబైల్ ఫోన్స్, లాప్ టాప్స్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకనుంచి అయినా పడుకునేటప్పుడు కాస్త మీ ఫోన్ ను పక్కన పెట్టి పడుకోండి.