Sleeping With Phone: నిద్రించే ముందు ఫోన్ ను పక్కనే పెట్టుకుంటున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..

మొబైల్ వాడకం వల్ల ఉపయోగాలతో పాటు అనేక అనార్థాలు కూడా ఉన్నాయి. చాలా మంది దీనిని సరైన విధంగా వాడడం లేదు. దీంతో అనేక రోగాలను తెచ్చుకుంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : October 15, 2023 1:50 pm

Sleep

Follow us on

Sleeping With Phone: నేటి కాలంలో మొబైల్ లేని చేతులుకనిపించవు. స్టూడెంట్ నుంచి ఉన్నత ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమ అవసరాల రీత్యా ఫోన్ ను వాడుతున్నారు. అయితే కొందరు పొద్దంతా మొబైల్ ను వాడింది చాలక.. రాత్రి కూడా మొబైల్ తోనే గడుపుతారు. మరికొందరైతే ఫోన్ చూస్తూ అటే నిద్రిస్తారు. ఈ క్రమంలో ఫోన్ ను అలాగే బెడ్ పై లేదా దిండు కింద పెట్టుకొని పడుకుంటారు. కానీ ఇలా మొబైల్ లను దిండుకింద పెట్టుకుంటే ఏం జరుగుతుంతో తెలిస్తే షాక్ అవుతారు. అంతే కాకుండా మరోసారి అలా చేయమని కూడా అంటారు. ఇంతకీ ఫోన్ ను దిండుకింద పెడితే ఏం జరుగుతుందో చూద్దాం..

మొబైల్ వాడకం వల్ల ఉపయోగాలతో పాటు అనేక అనార్థాలు కూడా ఉన్నాయి. చాలా మంది దీనిని సరైన విధంగా వాడడం లేదు. దీంతో అనేక రోగాలను తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా యూత్ రాత్రిళ్లు ఎక్కువ సేపు ఫోన్ తోనే గడుపుతున్నారు. మొబైల్ చూస్తూ అలాగే నిద్రిస్తున్నారు. కానీ ఇలా నిద్రించేముందు మొబైల్ ఎక్కువ సేపు చూడడం వల్ల నిద్రాభంగం కలగక తప్పదు. అంతేకాకుండా ఫోన్ రెడియేషన్ వల్ల మెదడు సమస్యలను ఎదుర్కోనే ప్రమాదం ఉంది.

యాపిల్ ఫోన్ తన కస్టమర్లకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఫోన్లను దిండు కింద లేదా, దుప్పట్లపై లేదా గాలి, వెలుతురు లేని చోట అస్సలు ఉంచకూడదట. నిద్రముందుకొస్తున్న సమయంలో ఫోన్ ను పక్కనే పెట్టుకొని నిద్రపోతారు. దీంతో మానసిక సామర్థ్యం తగ్గుతుంది. నిపుణుల ప్రకారం ఫోన్ ను పక్కనే పెట్టుకొని పడుకొనడం ద్వారా రేడియేషన్ కు గురై దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఫోన్ ను కనీసం 3 అడుగుల దూరం పెడితే మంచిదని అంటున్నారు.

ఇక ఫోన్ లో అలారం పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఫోన్లో అలారం పెట్టడం వల్ల పొద్దున్నే ఫోన్ ను చూడాల్సిన వస్తుంది. దీంతో ఫోన్ నుంచి వచ్చే లైటింగ్స్ కళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా ఫోన్ నుంచి వచ్చే శబ్దాలు మెదడుపై ప్రభావం చూపుతుంది. అందువల్ల నిద్రపోయే వారు ఫోన్ ను దాదాపు దూరంగా పెట్టడం మంచిది.