Morning Sleep: పగటిపూట అంతసేపు నిద్రపోతే ప్రమాదకరమే

వాస్తవానికి మధ్యాహ్నం నిద్రతో లాభాలు ఉన్నాయి? ప్రతికూలతలు ఉన్నాయి. మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రిపూట పని చేసే వ్యక్తులు ఎక్కువ సేపు మెలకువగా ఉంటారు. అటువంటివారు ఒత్తిడిని అధిగమించేందుకు పగటిపూట నిద్రిస్తారు.

Written By: Dharma, Updated On : December 20, 2023 7:35 pm

Morning Sleep

Follow us on

Morning Sleep: చాలామందికి మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటుంది. అయితే ఇలా నిద్రపోవడం మంచిదా? చెడ్డదా? అన్న అనుమానం ఉంటుంది. కానీ వేరు వేరు అధ్యయనాల్లో ఒక్కోలా చెబుతుంటారు. అయితే తాజాగా ఓ అధ్యయనం పగటిపూట నిద్ర అనేది నిర్దిష్ట సమయానికి పరిమితం అయితే చాలా బాగుంటుందని.. మనిషికి ఉత్తేజాన్ని ఇస్తుందని తేల్చింది. నిపుణులు కూడా ఈ అధ్యయనంతో ఏకీభవిస్తున్నారు. అలాగే నిద్రించాలని సూచిస్తున్నారు.

వాస్తవానికి మధ్యాహ్నం నిద్రతో లాభాలు ఉన్నాయి? ప్రతికూలతలు ఉన్నాయి. మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రిపూట పని చేసే వ్యక్తులు ఎక్కువ సేపు మెలకువగా ఉంటారు. అటువంటివారు ఒత్తిడిని అధిగమించేందుకు పగటిపూట నిద్రిస్తారు. ఒత్తిడి, పని భారం పెరిగితే పగటిపూట పడుకోవాలి అన్న ఆలోచన పెరుగుతుంది. ప్రతి 12 గంటలకు ఒకసారి శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా మధ్యాహ్నం పూట ఉంటుంది. అటువంటి సమయంలో కేవలం 20 నుంచి 30 నిమిషాల వరకు పడుకుంటే అలసట నుంచి దూరం కావచ్చు. ప్రశాంతత పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

మధ్యాహ్నం చిన్న నిద్ర తీసుకోవడం సర్వసాధారణం. కానీ ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. అది రాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. అందుకే వీలైనంతవరకు పగటిపూట పడుకోక పోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువసేపు నిద్రించడం వల్ల స్ట్రోక్ ముప్పు ఉంటుందని ఒక అధ్యయనం తేల్చింది. మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని మరో అధ్యయనం తేల్చింది. అయితే ఎక్కువ అధ్యయనాలు పగటిపూట నిద్ర వల్ల చేటేనని తేల్చడం విశేషం.