నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొందరు చిన్న పిల్లలు చదువును భారంగా భావిస్తారు. దీంతో రోజంతా స్కూల్ లో ఉండి మానసిక వేదనను అనుభవిస్తారు. అయితే ఇంటికి వచ్చాక కూడా అదే మైండ్ సెట్ ఉండడం వల్ల ఏదో కోల్పోయిన ఫీలింగ్ తో ఉంటారు. ఇదే సమస్య రాత్రి పడుకునేటప్పుడు కూడా ఉంటుంది. దీంతో నిద్రాభంగం సమస్యలు ఎక్కువగా వస్తాయి. మరికొంత మంది మొబైల్ తో కాలక్షేపం చేస్తుండడంతో వారిలో నిద్రలేమి సమస్య వస్తుంది. అయితే చిన్న పిల్లలు తొందరగా నిద్ర పోవడానికి కొన్ని ఆహార పదార్థాలను అలవాటు చేయాలి. అవి తినడం వల్ల వారిలో మానసిక సమస్యలు తొలగిపోయి నిద్ర బాగా పడుతుంది. అవేంటో చూద్దాం..
ఖర్జూర చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి రుచికరంగా ఉంటుంది. ఇది మన దేశంలో పడనందున ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ధర ఎంత ఉన్నా ఖర్చూరను చిన్న పిల్లలకు తినిపించడం చాలా మంచిది. ఇందులో సెలీనియం, కాల్షియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం తో పాటుు 15 రకాల మినరల్స్ ఉన్నాయి. ఇందులో అమైనో యాసిడ్స్, పాల్మిటోలిక్, ఒలిక్, లినోలెయిక్ వంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తినిపించడం వల్ల వారిలో మానసిక ప్రశాంతత ఏర్పడి నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి.
కివీ పండ్ల గురించి ఈమధ్య బాగా చర్చించుకుంటున్నారు. రోజుకు రెండు కివీ పండ్లు తినడం పిల్లల్లో నిద్రకు ఉపక్రమిస్తారు. ఇవి తినడం వల్ల 42 శాతం ఎక్కువగా నిద్రపోతున్నట్లు కొన్ని సర్వేల్లో తేలిచింది. వీటితో పాటు రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తీసుకోవడం వల్ల చిన్నారులు బాగా నిద్ర పోతారు. పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో నిద్రపోయే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా మంచి నిద్రకు పాలను తీసుకోవచ్చు.
ఆరోగ్యానికి కోడి గుడ్డు మంచిదని అందరికీ తెలుసు. కానీ నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒక గుడ్డును తినే విధంగా చూడాలి. గుడ్లలో సెరోటోనిన్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల మంచి నిద్ర వస్తుంది. ఈ పదార్థాలను ఇస్తూ పడుకునే ముందు మొబైల్ చూడకుండా ఉండాలి. ఏదైనా మంచి విషయాలను వారితో పంచుకుంటూ ఉండడం వల్ల వారి మనసు ఉల్లాసంగా మారుతుంది. దీంతో మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా నిద్రపోతారు.