Sleep: కళ్లు మూసిన వెంటనే నిద్రపట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!

కళ్లు మూసిన వెంటనే నిద్ర పట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. మరి ఇలా వెంటనే నిద్రపట్టాలంటే పాటించాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : November 3, 2024 5:19 pm

sleep

Follow us on

Sleep: ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌ లేదా మారిన జీవనశైలి వల్ల చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. మనిషికి తిండి, నీరు ఎంత ముఖ్యమూ నిద్ర కూడా అంతే ముఖ్యం. తిండి లేకపోయిన కొన్ని రోజులు బ్రతకగలరు ఏమో.. కానీ నిద్ర లేకపోతే బ్రతకలేరు. ఒక్క రోజు నిద్ర తక్కువైన మనిషి చాలా నీరసంగా అయిపోతారు. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈ రోజుల్లో అయితే ఎక్కువగా సోషల్ మీడియాకు బానిస అయ్యి.. పగలు, రాత్రి తేడా లేకుండా వాడుతున్నారు. మొబైల్ నుంచి వచ్చే ఆ కిరణాల వల్ల తొందరగా నిద్ర పట్టదు. దీనివల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మనిషికి నిద్ర లేకపోతే నీరసంగా అయిపోయి.. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. రోజంతా చిరాకుగా, నీరసంగా ఉంటుంది. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్లు మూసిన వెంటనే నిద్ర పట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. మరి ఇలా వెంటనే నిద్రపట్టాలంటే పాటించాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దాం.

నిద్రపోయే ముందు ఇలా చేయండి
చాలామంది నిద్రపోయే వరకు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ చూస్తుంటారు. దీంతో ఆ కిరణాలు కళ్ల మీద తొందరగా నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. మీకు నిద్ర వచ్చిన.. కళ్లు మూస్తే నిద్ర పట్టదు. కళ్లు మూసిన వెంటనే నిద్రపట్టాలంటే మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిద్రపోయే గంట లేదా రెండు గంటల ముందు మొబైల్ ఫోన్‌కి దూరంగా ఉండాలి. అలాగే పడుకోవడానికి ఒక 15 నిమిషాల ముందు చీకటి గదిలో ఉండాలి. ఒకవేళ వెళుతురు ఉంటే కళ్లు మూసుకుని లోతుగా శ్వాస తీసుకోవాలి. ఏం ఆలోచించకుండా నిద్రపోయే ముందు మనస్సును ఇలా ఉంచితే మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో మీరు వెంటనే నిద్రపోతారు.

సరైన సమయానికి ఫుడ్
రాత్రిపూట సరైన సమయానికి ఫుడ్ తీసుకుంటే పడుకున్న వెంటనే నిద్రపడుతుంది. కొందరు ఆలస్యంగా డిన్నర్ చేస్తుంటారు. దీనివల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే కెఫిన్, నిద్రకు భంగం కలిగించే ఆహారాలు ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా నిద్రపోయే ముందు స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది. అందులోనూ వేడి నీరు స్నానం అయితే బాగా నిద్రపడుతుంది.

యోగా, వ్యాయామం తప్పనిసరి
ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రి పూట తొందరగా, హాయిగా నిద్రపట్టాలంటే తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల బాడీకి బాగా అలసిపోతుంది. ఇలా అలసిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. బాడీకి శారీరక శ్రమ లేకపోతే రాత్రిపూట నిద్ర పట్టడం చాలా కష్టం. కాబట్టి ఈ నియమాలు తప్పక పాటించండి. ఇలా కొన్ని రోజులు చేస్తే చాలు.. కళ్లు మూసిన వెంటనే మీకు నిద్ర పడుతుంది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.