https://oktelugu.com/

Sleep: అతిగా నిద్రపోతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. అలా అని చాలా మంది ఎక్కువగా నిద్రపోతుంటారు. రోజు ఎక్కువగా వర్క్ చేస్తుంటారు. ఒక్కసారి ఎక్కువ గంటలు నిద్రపోతుంటారు. ఇలా ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అతిగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలేంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 11, 2024 / 10:29 PM IST

    Sleeping

    Follow us on

    Sleep: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలకి అయిన పెద్దవాళ్లకైనా సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్ర లేస్తున్నారు. పగలు ఎంత పడుకున్న.. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. అలా అని చాలా మంది ఎక్కువగా నిద్రపోతుంటారు. రోజు ఎక్కువగా వర్క్ చేస్తుంటారు. ఒక్కసారి ఎక్కువ గంటలు నిద్రపోతుంటారు. ఇలా ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అతిగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలేంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

    అతిగా నిద్రపోవడం వల్ల హాయిగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ మెదడు పనితీరు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్రపోవడం వల్ల మతి మరుపు రావడం, ఏకాగ్రత కోల్పోవడం, ఏ పని మీద కూడా ధ్యాస పెట్టలేరని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడు సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి నిద్ర వల్ల బరువు పెరగడం, స్థూలకాయం వంటి సమస్యలు వస్తాయి. వీటితో పాటు తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు వంటి శారీరక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నిద్రపోకపోతే గుండె సంబంధిత సమస్యలు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెటాబాలిజం సమస్యలు రావడంతో పాటు డయాబెటిస్ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    నిద్రలేకపోతే ఎలా నీరసంగా ఉంటుందో.. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల కూడా నీరసం, అలసట ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలు అన్ని వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయం తెలియక ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల జీవనశైలిపై ప్రభావం చూపుతుంది. అలాగే మెడ, వెన్నుపూస, తల నొప్పి వంటివి కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. మహిళల్లో అయితే సంతాన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఏదైనా లిమిట్‌లోనే ఉండాలి. తినే ఫుడ్ నుంచి నిద్ర వరకు మనిషికి ఎంత అవసరమో అంత ఉండాలి. కావాల్సిన దాని కంటే ఎక్కువగా నిద్రపోయిన లేదా తక్కువగా నిద్రపోయిన కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అతిగా నిద్రపోవద్దు. మీ బాడీకి సరిపడా మాత్రమే నిద్రపోండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.