Skin glow: అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కేవలం ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడితే సరిపోదు. ఆహారంలో కూడా కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అయితే అందంగా కనిపించాలంటే బ్యూటీ ప్రొడక్ట్స్, చిట్కాలు వంటివి పాటించక్కర్లేదట. మీలో ఉన్న ఒక్క క్వాలిటీని తీసివేసిస్తే సహజంగానే అందంగా కనిపిస్తారట. ఇంతకీ ఆ క్వాలిటీ ఏంటి? ఈ క్వాలిటీ వల్ల నిజంగానే అందం పెరుగుతుందో లేదో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
నేచురల్‌గా అందంగా కనిపించాలంటే అందరూ చేయాల్సింది ఒక్కటే. ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి గురవుకుండా, మానసికంగా సంతోషంగా ఉంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు. బాగా ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల మీకు తెలియకుండానే చర్మం దెబ్బతింటుంది. ఒక్కసారిగా చర్మ రంగు మారిపోవడం, ముఖంలో గ్లో తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చిన కూడా మానసికంగా సంతోషంగా ఉండండి. మానసికంగా సంతోషంగా ఉండే మీకు తెలియకుండానే మీ ముఖంలో ఒక కల కనిపిస్తుంది. బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా శరీరం నుంచి కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది. ఇవి చర్మంపై ఉండే గ్రంథులు మూసుకుపోయేలా చేస్తుంది. దీంతో ముఖంలో ఉండే కాంతివంతం తగ్గిపోయి, మొటిమలు, మచ్చలు కూడా వస్తాయి.
ఒత్తిడి వల్ల చర్మంపై పిగ్మెంటేషన్ రావడం, తొందరగా వృద్ధాప్య ఛాయలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కేవలం చర్మం మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. బాగా ఒత్తిడికి గురవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే జుట్టు కూడా రాలిపోయే ప్రమాదం ఉంది. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి చిన్న విషయాలకు ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని, అందాన్ని పాడుచేసుకోవద్దు. ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే యోగా, మెడిటేషన్ వంటివి చేయడం అలవాటు చేసుకోండి. వీటివల్ల ఒత్తిడి నుంచి తొందరగా బయటపడతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.