Affection Between The Couple: దంపతుల మధ్య అనురాగం ఆవకాయలా ఉండాలి? ఎందుకంటే?

భార్యభర్తల బంధం శాశ్వతమైనది. పవిత్రమైనది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కటయ్యే పెళ్లి సమయంలో ఎన్నో మంత్రాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకు కారణం ఈ దంపతులు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో కొందరు చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు తెచ్చుకుంటున్నారు

Written By: Srinivas, Updated On : October 28, 2024 1:15 pm

Affection Between The Couple

Follow us on

Affection Between The Couple: భార్యభర్తల బంధం శాశ్వతమైనది. పవిత్రమైనది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కటయ్యే పెళ్లి సమయంలో ఎన్నో మంత్రాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకు కారణం ఈ దంపతులు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో కొందరు చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు తెచ్చుకుంటున్నారు. ఈ గొడవలు పెద్దవిగా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి. అయితే పవిత్రమైన దాంపత్య జీవితం శాశ్వతంగా ఆనందంగా కొనసాగాలంటే.. కొన్ని పనులు తప్పక చేయాలి. వీటిలో అనురాగం కలిసి ఉండాలి. ఈ అనురాగం అవకాయలాగా ఉండాలి. కొందరు దంపతులు కలిసి మెలిసి ఉంటారు. కానీ వారి మధ్య అనురాగం ఉండదు. దీంతో వీరు ఒకరిపై మరొకరికి నిజమైన ప్రేమ ఉండకపోవడంతో వారి జీవితం సంతోషంగా ఉండదు. మరి ఆ అనురాగం ఎలా ఉండాలంటే?

భార్యభర్తలిద్దరూ సమానమే. దీంతో ఒకరిపై ఒకరు గౌరవంగా ఉండాలి. మగవాళ్లు బయట పనులు చేస్తారు. ఆడవాళ్లు ఇల్లును చక్కదిద్దుతూ ఉంటారు. అంత మాత్రానా ఎవరూ తక్కువ అనుకోకూదు. అయితే ఒక్కో సందర్భంలో ఒకరు మంచి పనుల చేయొచ్చు. ఇలాంటి సమయంలో వారు చేసిన పనిని గుర్తించాలి. దానికి సరైన బహుమానం ఇవ్వాలి. అదేంటంటే వారు చేసిన మంచి పనిని పొగుడ్తూ ఉండాలి. ఏదైనా బాగున్నప్పుడు బాగుంది.. అని చెప్పడం వల్ల ఆ పని చేసిన వారిలో ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది.

ముఖ్యంగా ఆడవాళ్లు రుచికరమైన వంటలు వండుతూ ఉంటారు. కానీ కొందరు మగవాళ్లు ఇవేమీ పట్టించుకోరు. కనీసం వారి కష్టాన్ని గుర్తించరు. కానీ వంట రుచికరంగా ఉన్నప్పుడు బాగుంది అని ఒక్క మాట చెప్పాలి. అప్పుడు వారిలో ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది. ఈ ఒక్క మాటతో వారి మనసును ఉల్లాసపర్చవచ్చు. దీనినే అనురాగం అంటారు. భార్యపై ఇలాంటి అనురాగం రోజులో ఒకసారి అయినా చూపించడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారు. ఈ సంతోషంతో వారు మరిన్ని రుచికరమైన వంటలు చేస్తుంటారు.

ఈ విషయం ఆడవారికే మాత్రం కాదు. మగవారికి కూడా వర్తిస్తుంది. ఆడవాళ్ల కంటే మగవారికి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగని వారు గొప్ప అనలేం. కానీ వారు చేసే కొన్ని పనులను గుర్తించాలి. ఒక్కసారి ఆఫీసుల్లో, ఇతర విషయంలో వారు మంచి పనులు చేస్తుంటారు. అలాంటి సమయంలో వారిని పొగుడతూ ఉండడం వల్ల వారు ఎంతో గొప్పగా ఫీలవుతారు. అందులోనూ భార్య సపోర్టు చేయడం వల్ల తనకు భరోసా ఉందని భావిస్తారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అనురాగాన్ని పంచుకుంటూ ఉండాలి.

అనురాగం ఆవకాయలా ఉండాలి? అని ఎందుకు అనాల్సి వస్తుందంటే? అవకాయ ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీనిని ఒకరికి వడ్డిండం వల్ల వారు ఎంతో సంతోషిస్తారు. వారు తమపై అనురాగాన్ని పంచుతున్నారని అనుకుంటారు. అందుకే అనురాగానికి, ఆవకాయకు దగ్గరి సంబంధం ఉంటుంది. భార్యభర్తల మధ్య మాత్రమే కాకుండా ఇష్టమైన వ్యక్తుల మధ్య కూడా అనురాగం ఉండడం వల్ల వారి మధ్య బంధుత్వం బలపడుతుంది. దీంతో వారు ఎప్పుడూ సంతోషంగా జీవిస్తారు.