Kidney Problems: కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్ రూట్ తినకూడదా? ఎందుకు?

కొన్ని కూరగాయల్లో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చినా వాటిలో ఉండే బలమైన పోషకాలు కొన్ని జబ్బులు ఉన్నవారు తినకపోవడమే మంచిదని అంటున్నారు. కిడ్నీ సమ్యలతో బాధపడే వారు బీట్ రూట్ జోలికి వెళ్లొద్దంటున్నారు.

Written By: Srinivas, Updated On : January 10, 2024 10:33 am

Kidney Problems

Follow us on

Kidney Problems: మార్కెట్ కు వెళ్లినప్పుడు బీట్ రూట్ తక్కువగా కనిపిస్తుంది. కానీ వీటిని దొరికినప్పుడల్లా తీసుకొని తినడమే ఎంతో మంచిదని ఇప్పటి వరకు చాలా మంది వైద్యులు చెప్పారు. ఎందుకంటే బీట్ రూట్ లో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎనర్జీతో పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో బీట్ రూట్ తినడం ఎంతో మేలు. కానీ ఈ రకమైన జబ్బులు ఉన్న వారు మాత్రం బీట్ రూట్ జోలికి వెళ్లొద్దని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వారు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

కొన్ని కూరగాయల్లో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చినా వాటిలో ఉండే బలమైన పోషకాలు కొన్ని జబ్బులు ఉన్నవారు తినకపోవడమే మంచిదని అంటున్నారు. కిడ్నీ సమ్యలతో బాధపడే వారు బీట్ రూట్ జోలికి వెళ్లొద్దంటున్నారు. వీరు తినడం వల్ల మూత్రపిండాలు మరింత అనారోగ్యానికి గురవుతాయి. అంతేకాకుండా బీట్ రూట్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు పెరుగుతాయి. అయితే వీరు ఉడికించిన బీట్ రూట్ ను తినొచ్చు. కానీ అలా చేస్తే ఇందులో ఉండే మినరల్స్ మాయమవుతాయి.

బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారు బీట్ రూట్ గురించి మరిచిపోవాలంటున్నారు. బీట్ రూట్ తినడం వల్ల నైట్రేట్ రక్తనాళాలు విస్తరిస్తాయి. దీంతో బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. ఈ కారణంగా మూర్చకు గురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణ సమస్యలు ఉన్న వారు కూడా బీట్ రూట్ కు దూరంగా ఉండాలి. వీరు బీట్ రూట్ ను తినడం వల్ల గ్యాస్ లేదా అజీర్తి సమస్యలు వస్తాయి. బీట్ రూట్ లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది తొందరగా జీర్ణమవదు.