Wedding invitation: పెళ్లంటే నూరేళ్లపంట. ఇద్దరు తెలియని వ్యక్తులు కలిసి జీవితాంతం ప్రయాణం చేయడానికి ఏర్పరచుకున్న బంధం. ఈ బంధం బాగుండాలని.. బలపడాలని.. పెళ్లి జరిగే సమయంలో స్నేహితులు, చుట్టాలు, ప్రముఖులు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదిస్తారు. అయితే కొంతమంది పెళ్లిళ్లకు వెళ్లడం అస్సలు ఇష్టం .. మరికొందరు పెళ్లికి వెళ్లాలంటే ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ ఉద్యోగుల పెళ్లిళ్లకు వెళ్లడానికి అసలు ఇష్టపడరు. వారికి సరైన సౌకర్యం దొరకదని.. అక్కడ తమకు సరైన రిసీవింగ్ ఉండదని… భావిస్తారు. అంతేకాకుండా తమకు నచ్చిన వాతావరణం ఉండదని అనుకొని అక్కడికి వెళ్లకుండా ఉంటారు. కానీ ఇలాంటి వారి పెళ్లికి తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా?
ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పెళ్లి అని భావిస్తాడు. ఏ వేడుక చేయని ఘనమైన కార్యాన్ని పెళ్లిలో మాత్రమే చేస్తారు. తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ వేడుకను ఘనంగా జరిగేలా చూస్తారు. మీ పెళ్లికి చిన్న పెద్ద అని తేడా లేకుండా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు, అధికారులను అందరిని పిలుస్తారు. అయితే ఇక్కడ పెళ్లి చేసుకునే వ్యక్తి ఉద్యోగి అయితే తన లీడర్ లేదా బాస్ లేదా బ్రాంచ్ మేనేజర్ వంటి ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. వాళ్లు తప్పకుండా తప్పకుండా రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారి పెళ్లికి తప్పకుండా వెళ్లాలని కొందరు చెబుతున్నారు.
ఎందుకంటే ఒక ఉద్యోగి తన పై అధికారి పెళ్ళికి వస్తాడని ఆశతో ఎదురు చూస్తారు. అంతేకాకుండా తన రాక కోసం ముందే ఏర్పాటు సిద్ధం చేసుకుంటాడు. తను ఎలాంటి తిండి తింటాడో.. ఏ విధంగా అయితే సౌకర్యంగా ఉంటాడో అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. అంతేకాకుండా తన చుట్టాలు, బంధువులకు ముందే చెప్పి సార్ రాగానే రిసీవ్ బాగా ఉండాలని తెలియచెప్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన బాస్ పెళ్లికి వెళ్లక పోతే ఎంతో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ అధికారిపై విచారం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే ఇలాంటి వారి పెళ్లికి కొంచెం సమయం తీసుకొని తప్పకుండా వెళ్లాలని అంటున్నారు. ఎందుకంటే మనం కోరుకునే వాళ్ల కన్నా.. మనల్ని కోరుకునే వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ మనకు సరైన గౌరవం ఉండడంతోపాటు విలువ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా మనం ఆ పెళ్లికి వెళ్లడంతో వారు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారని.. వారి చుట్టుపక్కల వారిలో కూడా గౌరవం పెరుగుతుందని అంటున్నారు. అందువల్ల ఇలాంటి వారి పెళ్లికి తప్పకుండా వెళ్లాలి.