
Corona Update: కరోనా మహమ్మారి వల్ల ప్రజలు వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో పురుషులతో పోలిస్తే మహిళలను ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆ ఆరోగ్య సమస్యలలో ఊపిరితిత్తుల వైఫల్యం, ఉదర సంబంధ సమస్యలు, జ్వరం, పెరిగిన హృదయ స్పందన, నిద్రలేమి, అలసట, శ్వాస ఆడకపోవడం సమస్యలు ఉన్నాయి.
కరోనా(Corona Update) నుంచి కోలుకున్న వాళ్లలో చాలామంది లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ తో బాధ పడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుండగా ఈ సమస్యలతో బాధ పడే మహిళలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని నెలరోజుల నుంచి మూడు నెలల పాటు అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొందరు రక్తం గడ్డకట్టే సమస్యతో కూడా బాధ పడుతున్నారని తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు షుగర్, బీపీ లెవెల్స్ ను తరచూ చెక్ చేసుకోవాలి. ఈ సమస్యలతో బాధ పడే మహిళల్లో అలసటతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కళ్లలో బలహీనత, కిడ్నీ సమస్యలు కూడా వీళ్లను ఎక్కువగా వేధిస్తాయి.
ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు, శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. లాంగ్ కోవిడ్ రోజువారీ పనితీరుపై ఎక్కువ ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంపదించడం మంచిదని చెప్పవచ్చు.