Flight Journey: ప్రస్తుత కాలంలో Flight Journey చాలా సులువుగా మారింది. ఎందుకంటే కొన్ని విమాన సర్వీసులు అందించే కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. దీంతో విహార యాత్రలకు వెళ్లాలని అనుకునేవారు తక్కువ ఖర్చుతోనే ఫ్లైట్ లో వెళ్లే అవకాశం రావడంతో చాలా మంది ఇందులోనే ప్రయాణిస్తున్నారు. అయితే బస్సు, ట్రైన్ జర్నీ కంటే Flight Journey జర్నీలో కాస్త నిబంధనలు ఎక్కువగా ఉంటాయి. చక్రాలు ఉన్న వాహనాలు నేలపై ప్రయాణించడం వల్ల వీటిలో కాస్త లగేజీ బరువు అటూ ఇటూ అయినా పర్వాలేదు. కానీ గాలిలో ఎగిరే ఫ్లైట్ లో ఎంత బరువు అనేది నిర్దిష్టంగా ఉంటుంది. అయితే ఇటీవల విమానాల్లో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించిన డిపార్ట్ మెంట్ కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. అవేంటంటే?
Flight Journey చేసేవాళ్లు ఈ ప్రయాణంపై ముందుగా అవగాహన ఉండాలి. లేదా అవగాహన ఉన్న వారితో ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఎయిర్ పోర్టు లో ఎంట్రీ అయినప్పటి నుంచి ఫ్లైట్ దిగే వరకు కొన్ని రూల్స్ పాటించాలి. ముందుగా ఎయిర్ పోర్టు లోకి ఎంట్రీ అవగానే ఇనుప వస్తువులు ఉంటే తీసేయాలి. ముఖ్యంగా ఆయుధంగా భావించే వాటిని తీసుకెళ్లకుండా ఉండాలి. ఇవి బ్లేడ్ నుంచి సీజర్ వరకు ఏవీ ఉన్నా.. ఎయిర్ పోర్టు సిబ్బంది వాటిని తీసేస్తారు. ఫ్లైట్ ఎక్కిన తరువాత సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి. అలాగే ముందు ఒక టేబుల్ లాగా ఉన్న వాటిపైనే గ్లాస్ లేదా ఇతర వస్తువులను ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా గట్టిగా మాట్లాడకుండా ఉండాలి.
ఫ్లైట్ జర్నీలో ప్రధానమైనది పరిమిత బరువు ఉండే లగేజ్ ని తీసుకెళ్లడం. కొందరు అధిక బరువులు ఉండే బ్యాగులను వెంట తీసుకెళ్లాలని చూస్తారు. అయితే ఈ బ్యాగులను చెక్ ఇన్ వారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే కొందరు జర్నీ చేసే సమయంలో తమ వద్దే ఓ బ్యాగు ఉంచుకోవాలని చూస్తారు. ఇందులో విలువైన వస్తువులు ఉండడం వల్ల ఈ బ్యాగును చెక్ ఇన్ వారికి ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే ఈ బ్యాగు విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ బ్యాగు బరువు 7 కిలోల కంటే తక్కువగా ఉండాలి. లేటేస్ట్ గా BCAS, CISFసంస్థలు ఫ్లైట్ జర్నీ చేసే వారి కోసం కొత్త రూల్ ను తీసుకొచ్చారు. ఇక నుంచి ప్రయాణికులు తమ వెంట ఒక బ్యాగును మాత్రమే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 7 కిలోల కంటే తక్కువగా ఉండాలి. ఈబ్యాగు 55 సెంటి మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. లెన్త్ 40 సెంటిమీటర్ల కంటే తక్కువగా ఉండాలి. వెడల్పు 20 సెంటిమీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఈ పరిమితులకు లోబడి మాత్రమే ఉంటేనే ఈ బ్యాగును ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లి కూర్చునే చోట క్యాబిన్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ పరిమితి కంటే ఎక్కువ బరువున్న బ్యాగులు కచ్చితంగా చెక్ ఇన్ లో ఇవ్వాల్సి ఉంటుంది.