Jio Users: టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇందులో భాగంగా వినియోగదారులను తనవైపు ఆకర్షించింది. మెల్లమెల్లగా చార్జీల భారం మోపుతోంది. రిలయన్స్ తన కస్టమర్లకు మరోమారు షాక్ ఇస్తోంది. తాజాగా డిస్నీ ప్లస్, హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ బండిల్స్ ప్లాన్లపై ఇరవై శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారులపై భారం పడనుంది. ఇంతకుముందు రూ.499తో ప్రారంభమయ్యే ధర ఇకపై రూ. 601 నుంచి ప్రారంభం కానుంది. దీంతో వినియోగదారులపై రూ.100 అదనంగా భారం పెంచనుంది.

గతంలో 28 రోజులకు 3జీబీతో డిస్నీ హాట్ స్టార్ ఏడాదికి రూ. 601కి పెంచింది. దీంతో 6 జీబీ హైస్పీడ్ డేటా అదనంగా అందించేది. ఇకపై ఈ ధర 799కి పెంచడం గమనార్హం. ఇందులో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్ర్ర్కిప్షన్ తో పాటు 56 రోజుల గడువుతో 2 జీబీ డేటా అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పుడు ఖరీదుగా మారాయి. రిలయన్స్ జియో ధరలు పెంచడంతో వినియోగదారుల జేబులు గుల్ల కానున్నాయి. పెంచిన ధరలతో కస్టమర్లకు గుండెలకు దడ పుట్టిస్తున్నాయి.
రూ.185 ప్లాన్ ప్రస్తుతం రూ. 222 గా పెరిగింది. దీంతో ధరలు అమాంతం పెంచడంతో వినియోగదారులు భయపడుతున్నారు. రూ.749ల ప్లాన్ కాస్త రూ.899గా పెంచేశారు. దీంతో రూ.150 భారం పడుతోంది. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. జియో పెంచిన ధరలతో కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు తక్కువ ధరకే అందించిన సేవలు కాస్త ఇప్పుడు పెరగడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రిలయన్స్ సంస్థ ఇలా ధరలు పెంచితే భవిష్యత్ లో కష్టాలే అని చెబుతున్నారు.

దేశీయ టెలికం కంపెనీ జియో ధరలు భారీగా పెంచడంతో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మూడు రీచార్జి ప్లాన్లతో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగించింది. జియో ఫోన్లు వాడే వారికి రీచార్జి ప్లాన్ల ధరలు పెంచడం గమనార్హం. మూడు స్థాయిల్లో ధరలు పెంచి తన వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో కంపెనీ ధరలు పెరగడంతో వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్ని ఫీచర్లు అందించినా ధరలు పెంచడంతో ఇక మీదట వినియోగదారుల బడ్జెట్ పెరగనుంది.