Shani Dosha Nivarana
Shani Dosha Nivarana: శని దేవున్ని తిట్టని వారుంటారా? దరిద్రం, శని పట్టినట్టు పట్టింది.. ఇలా రకరకాలుగా తిడుతుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా దీనికి కారణం శని అంటారు. శని ఉంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుందని భావిస్తారు. లేదా ఆరోగ్య సమస్యలైన వస్తాయని అనుకుంటారు. అందుకే శని దేవున్ని అస్తమానం తిడుతుంటారు. అంతేకాదు కొందరిని శనిదేవునితో పోల్చి మరి తిడుతారు. కానీ అందరికీ తెలియని రహస్యం ఒకటుంది. అది తెలిస్తే శని దేవున్ని తిట్టడం మానేస్తారు. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అయితే చదివేయండి.
రహస్య శాస్త్రాల ప్రకారం శని భగవానుడు చేసినంత మేలు ఇతర దేవుళ్లు చేయరట. అయితే జన్మతహ శని దోషాలు ఉంటే మాత్రం కొంత కాలం పాటు ఆ కష్టాలను కచ్చితంగా అనుభవించాల్సిందే అని చెబుతున్నాయి ఈ శాస్త్రాలు. ఎందుకంటే సృష్టికి మూలమైన శివున్ని కూడా కొంతకాలం పాటు శని భగవానుడు ఆవహస్తాడని.. ఆ భయంతో శివుడు దాక్కున్నాడని కూడా చెబుతుంటారు. మరి శివయ్యతోని పోలిస్తే మనుషులెంత? శని దోషాలను తొలగించడానికి కొన్ని రకాల నివారణలు, ఉన్నాయని రహస్య శాస్త్రాలు చెబుతున్నాయంటున్నారు పండితులు.
కొన్ని రకాల ఆహారాలను చీమలకు వేస్తే మనిషికి ఉన్న శని దోషాలు తొలిగిపోతాయట. శనిపీడ తొలిగిపోతుందని కూడా పండితులు చెబుతున్నారు. వీటి కోసం 100 గ్రా. ఎండు ఖర్జూరం, 100 గ్రా. చక్కర, 100 గ్రా. ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలి. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. శని వల్ల బాధ పడుతున్నవారు ఈ ఆహారాన్ని ఉదయం లేవగానే చీమలకు పెడితే శనినివారణ అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు తినే మొదటి ముద్దను తీసి కాకికి ఆహారంగా పెట్టడం వల్ల కూడా శని దోషాలు పోతాయట. ఆర్థికకంగా, ఉద్యోగ, వ్యాపార వృద్ది పొందాలంటే శని గ్రహ పూజలు చేయించుకోవాలట.