Fraud : కడుపు చేస్తే రూ.13లక్షల ఆఫర్.. త్వరపడితే మీ పని ఖతమే

అరెస్ట్‌ అయినవారిలో దేశవ్యాప్తంగా నడుస్తున్న పెద్ద సైబర్ క్రైమ్ సిండికేట్లో భాగమని చెప్పారు. ఇది కూడా సైబర్‌ మోసం లాంటిదే అని కొత్తగా ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.

Written By: NARESH, Updated On : January 2, 2024 6:30 pm
Follow us on

Fraud : బీహార్‌.. నేరాలు, మోసాలు, బందిపోటు ముఠాలకు కేరాఫ్‌. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు యథేచ్చగా జరిగేవి. ప్రస్తుతం పాలకులు తీసుకుంటున్న చర్యలు, పెరిగిన టెక్నాలజీతో కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా దొమ్మీలు, దోపిడీలు, బందిపోటు దాడులు జరుగుతున్నాయి. ఇటీవల సైబర్‌ మోసాలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో అదే బిహార్‌లో ఓ కొత్త రకం మోసం వెలుగు చూసింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ నుంచి యువకులకు జాబ్ ఆఫర్ మెసేజ్‌లు వెళ్లాయి. గర్భం దాల్చని మహిళలకు గర్భం చేస్తే రూ.13 లక్షల వరకు ఇస్తామని పేర్కొన్నారు.

రిజిస్ట్రేన్‌కు రూ.799
ఇందు కోసం ముందుగా యువకులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు ప్రత్యేక సైట్‌ రూపొందించారు. రూ.799 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అమ్మాయిల ఫొటోలు కనిపిస్తాయి. నచ్చిన అమ్మాయిని ఎంచు కొని గర్భవతిని చేయడమే జాబ్‌ నేచర్‌. అలా చేస్తే రూ.13 లక్షలు చెల్లిస్తుంది. ఒకవేళ గర్భవతిని చేయలేక పోతే ప్రోత్సాహం కింద రూ.5 లక్షలు ఇస్తారు.

సెక్యూరిటీ డిపాజిట్‌..
ఫేస్బుక్‌, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అమాయక ప్రజలే టార్గెట్‌గా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పనిచేసింది. వారి వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని అమ్మాయిని ఎంపిక చేసుకున్న తర్వాత సెక్యూరిటీ డిపాజిట్‌ కింద అబ్బాయిలు రూ.5 వేల నుంచి రూ.20వేలు చెలి‍్లంచాలని కండీషన్‌ పెట్టేవారు. అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత ప్రైజ్ మనీ చెల్లిస్తానని తెలిపారు. యువకుడు డబ్బులు డిపాజిట్‌ చేయగానే ఈ బృందం ఉడాయించేది.

ప్రత్యేక బృందం దర్యాప్తు..
‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ గురించి తెలుసుకున్న బీహార్‌ పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. కీలక సూత్రధారి మున్నా కుమార్‌ ఉన్నట్లు గుర్తించారు. అతడికి సంబంధం ఉన్న ప్రాంతాలపై దాడులు చేసిన తర్వాత ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మాత్రం తప్పించుకున్నాడని డీఎస్పీ కళ్యాణ్‌ ఆనంద్‌ తెలిపారు. అరెస్ట్‌ అయినవారిలో దేశవ్యాప్తంగా నడుస్తున్న పెద్ద సైబర్ క్రైమ్ సిండికేట్లో భాగమని చెప్పారు. ఇది కూడా సైబర్‌ మోసం లాంటిదే అని కొత్తగా ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.