Toothache: నేటి సమాజంలో పళ్లకు సంబంధించిన వ్యాధులు రావడం సర్వ సాధారణం అయిపోయింది. మీకు తెలుసా ? నూటిలో తొంబై శాతం మంది పంటి నొప్పితో బాధపడుతున్నారు. అయితే, పంటి నొప్పికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా ? తీపి పదార్థాలు తినడం, అలాగే సరిగా బ్రష్ చేసుకోక పోవడం వంటి కారణాల కారణంగా పంటి సమస్యలు వస్తాయి. పంటి నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం.

మరి ఈ పంటి నొప్పి వెంటనే తగ్గడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం రండి.
వెల్లుల్లి, లవంగంను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచండి. కొద్ది సేపట్లోనే మీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ పేస్ట్ వలన ఎప్పటి నుండో ఉన్న నొప్పి కూడా తగ్గుతుంది.
Also Read: పవన్ కి ఎంత అన్యాయం చేశావ్ రాజమౌళి…!
దంత శుద్దికి, అలాగే పంటి నొప్పికి గోధుమ గడ్డి రసంను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూడా బాగా పని చేస్తోంది.
ఇక పంటి నొప్పి ఉన్న దంత భాగంలో ఐస్ క్యూబ్ పెట్టినా.. నొప్పి వెంటనే తగ్గుతుంది.
చిగుళ్ల వాపు మరియు నొప్పి తగ్గుటకు మిరియాల పొడిని దంత మంజన్ లా వాడి పళ్ల పై రుద్దితే చాలు. నొప్పి నుంచి మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.
మనలో చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. ఇది చాలా మంచి అలవాటు అంటున్నారు వైద్యులు. ఉల్లిపాయను మూడు నిమిషాలు నమిలితే పంటి నొప్పి తగ్గిపోతుందట. ఈ విషయం చాలామందికి తెలియదు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి.
ఇక పొద్దున రాత్రిపూట క్రమం తప్పకుండా బ్రష్ చేసుకున్నా పంటి సమస్యలు రావు. ఏదైనా తిన్నపుడు నోటిని పరిశుభ్రం చేసుకోవాలి. ఈ చిన్న చిట్కాలను పాటించి పంటి నొప్పిని తగ్గించుకోండి.
Also Read: మహేష్ తో సాయి పల్లవి.. త్రివిక్రమ్ కూడా థ్రిల్ ఫీల్ అయ్యాడు !
[…] Read: తీవ్రమైన పంటి నొప్పా.. క్షణంలో మాయం ! రాత్రి వేళ పొట్టేలును బలిచ్చేందుకు […]