https://oktelugu.com/

Mobile Photos : ఈ చిన్న ట్రిక్ తో మీ ఫ్రెండ్స్ కు ఫోటోలు పంపే శ్రమ తగ్గుతుంది..

సాధారణంగా ప్రతి ఒక్కరి ఫొటోలు ఫిల్టర్ చేసిన ఎవరి పిక్స్ వారికి పంపించాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కానీ ఇలా చేయడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 18, 2024 / 09:39 PM IST
    Follow us on

    Mobile Photos : మొబైల్ వాడకం వచ్చిన తరువాత ప్రపంచం చేతిలో ఉంటుంది. కమ్యూనికేషన్ తో పాటు ఇతర పనులు మొబైల్ లోనే చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ వచ్చిన తరువాత ఫొటో కెమెరా కనుమరుగైపోయింది. ఇప్పుడు మొబైల్ తోనే ఫుల్ క్లారిటీ ఫోటోలు రావడంతో కెమెరాను ఉపయోగించేవారు తక్కువయ్యారు. అయితే మొబైల్ తో ఫొటోలు తీసిన తరువాత వాటిని పంపించడానికి పెద్ద ప్రయాసే ఉంటుంది. ఏదైనా టూర్ కు వెళ్లినప్పుడు పలువురి ఫొటోలు తీసి ఎవరి పిక్స్ వారికి సెండ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. కానీ ఈ చిన్న ట్రిక్ ద్వారా ఆ శ్రమ పడనక్కర్లేదు. మరి ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందామా..

    మొబైల్ లోని ప్లే స్టోర్ లో ఎన్నో రకాల యాప్స్ ఉంటాయి. అవసరాలను బట్టి రకరకాల యాప్స్ ను ప్రతి రోజూ లక్షల మంది డౌన్లోడ్ చేసుకుంటారు. ఏదైనా ఒక పనిని ఈజీగా చేసుకోవడానికి యాప్స్ ను రూపొందిస్తారు. అలాగే ఫొటో సెండింగ్ లో అధిక శ్రమను తొలగించేందుకు ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే kwickpic యాప్. ఈ యాప్ ద్వారా ఎంత మందికైనా ఎన్ని ఫొటోలైనా ఒకేసారి వారి వారి ఫొటోలను ఒకేసారి పంపించవచ్చు. మరి దీనిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం..

    ముందుగా ప్లే స్టోర్ నుంచి kwickpic యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత క్రియేట్ గ్రూప్ పై క్లిక్ చేసి ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్స్ ఇందులో చేర్చాల్సి ఉంటుంది. ఆ తరువాత ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ ను కాపీ చేసి అప్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మొబైల్ లో తీసిన ఫొటోలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ఫొటోలు సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఫొటోలు అప్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.

    ఆ తరువాత ముందుగా కాపీ చేసిన లింక్ ను ఎవరి ఫొటోలు అయితే తీశారో వారికి ఈ లింక్ ను పంపించాలి. ఈ లింక్ ను వారు క్లిక్ చేయగానే వారి ఫ్రొఫైల్ పిక్చర్ ను అడుగుతుంది. వారి ఫేస్ ను రికగ్నైజ్డ్ చేసిన వారికి సంబంధించిన ఫొటోలు ఆ లింక్ ద్వారా ఓపెన్ అవుతాయి. అప్పుడు వారికి కావాల్సిన ఫొటోలు డౌన్లోడ్ చేసుకుంటారు. సాధారణంగా ప్రతి ఒక్కరి ఫొటోలు ఫిల్టర్ చేసిన ఎవరి పిక్స్ వారికి పంపించాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కానీ ఇలా చేయడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది.