
Second Hand Cars : మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు దాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు.అందుకే కొత్త ఒక వింత పాత ఒక రోత అనే సామెత ఉంది. కానీ మన దగ్గర ఉన్న పాత కారును అమ్మాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పాత కారును అమ్మే విధానంలో మనం కొన్ని చిట్కాలు పాటించాలి. లేదంటే మన కారుకు తగినంత ధర రాదు. దీంతో మనం నష్టపోవడం గ్యారంటీ. ఈ నేపథ్యంలో పాత కారు ఎలా అమ్మాలనే దాని గురించి కొంత శ్రద్ధ తీసుకోవాల్సిందే.
బాగా దూరం
పాత కారు కొనుక్కునే వారు అది ఎక్కువ దూరం తిరిగితే కొనడానికి మొగ్గు చూపరు. ఎందుకంటే బాగా వాడిన తరువాత అమ్ముతున్నారనే అభిప్రాయం వారిలో ఉంటుంది. దీంతో వారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. దీని విషయంలో మనం కొంత అప్రమత్తంగా ఉండాలి. కారును ఎక్కడికి పడితే అక్క డికి తిప్పితే దూరం పెరగొచ్చు. దీనిపై కాస్త ఆలోచించాలి.

అమ్మితే లాభం ఎంత?
కారును అమ్మేటప్పుడు అది అమ్మడం వల్ల మనకు ఎంత వస్తుంది. మన రాబడి మొత్తం కలిపితే ఎంత అవుతుంది. తదితర విషయాలు ఆలోచించుకోవాలి. లేకపోతే మనకు ఇబ్బందులు తప్పవు. పాత కారును తొలగించుకుని కొత్త కారు కొనుక్కోవాలని అందరు ఆశిస్తారు. కానీ కారు వినియోగం గురించి కూడా పట్టించుకోవాలి. లేకపోతే మనకు నష్టం రావడం ఖాయం.
ఎన్ని రోజులకు..
కారు కొన్న తరువాత ఓ 4-5 ఏళ్ల లోపు అమ్మితే ఫర్వాలేదు. మంచి ధర వస్తుంది. కానీ ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకుంటే మాత్రం ఎవరు కొనరు. ఎందుకంటే బాగా పాతది అయిన తరువాత కొంటే వారి దూల తీరుతుందని వారి నమ్మకం. అందుకే సాధ్యమైనంత వరకు కొద్ది రోజులకే అమ్ముకుంటే మంచి ధర వస్తుంది. దీంతో కొత్త కారు కొనుక్కోవడం సులభమే అవుతుంది.