https://oktelugu.com/

Self Confidence: ఈ టిప్స్‌తో పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండిలా!

చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులే పిల్లలో ఆత్మవిశ్వాసం పెంచాలి. అప్పుడే వాళ్లు జీవితంలో పైకి ఎదుగుతారు. ఎలాంటి సమస్యలు వచ్చిన కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అయితే కొన్ని టిప్స్‌తో పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. అదేలా మరి ఆ ఆర్టికల్‌లో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 20, 2024 / 01:58 AM IST

    Parenting Tips

    Follow us on

    Self Confidence: తల్లిదండ్రులను చూసే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. పిల్లలను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ప్రతి విషయం గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం చాలా ముఖ్యమైనది. చిన్నప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారో అవే అలవాట్లు ఉండిపోతాయి. చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులను ఒక రోల్ మోడల్‌గా చూస్తారు. ఆ సమయంలో పిల్లల కోసమైన తల్లిదండ్రులు మంచిగా ఉండాలి. ఎందుకంటే చిన్నతనంలో పిల్లలకు మంచి ఏది, చెడు ఏది తెలియదు. పెద్దవారు ఏం చేస్తే అదే మంచి, చెడు అని అనుకుంటారు. కాబట్టి పిల్లలకు చిన్నతనంలో మంచి విషయాలను మాత్రమే తల్లిదండ్రులు నేర్పించాలి. కొందరు తల్లిదండ్రులు చాలా భయంతో ఉంటారు. కనీసం ఆత్మ విశ్వాసం లేకుండా భయపడుతుంటారు. ఇలా ఉన్న తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా అలాగే తయారవుతారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులే పిల్లలో ఆత్మవిశ్వాసం పెంచాలి. అప్పుడే వాళ్లు జీవితంలో పైకి ఎదుగుతారు. ఎలాంటి సమస్యలు వచ్చిన కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అయితే కొన్ని టిప్స్‌తో పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. అదేలా మరి ఆ ఆర్టికల్‌లో చూద్దాం.

    పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం మంచిదే. కానీ వారిని ఒక కంఫర్ట్ జోన్‌లో అయితే పెంచవద్దు. ఎందుకంటే వారు దానికే అలవాటు పడతారు. ఏ సమస్య వచ్చిన కూడా క్లియర్ చేసుకోలేరు. ప్రతీ చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కాబట్టి పిల్లలకు అన్ని విషయాలు, కష్టాలు, సుఖాలు అన్ని తెలిసిలా పెంచాలి. అప్పుడే వారు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థాయిలో ఉండగలరు. కష్టం వచ్చిందని భయపడి పారిపోకుండా ఉంటారు. పుట్టినప్పుడు అందరి పిల్లలు ఒకేలా పుడతారు. కానీ వారిని పెంచే విధానంలోనే తేడా ఉంటుంది. నీ జీవితంలో జరిగిన వాటికి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే తీసుకునే నిర్ణయం కరెక్టా? లేదా? అనే క్లారిటీ పిల్లలకు ఉండే విధంగా తల్లిదండ్రులే పెంచాలి.

    పిల్లలకు ఎప్పుడూ ఖాళీగా ఏ పని చేయకుండా ఉంచవద్దు. ఇలా ఉంచడం వల్ల పిల్లలకి ఏ విషయాలు పెద్దగా తెలియవు. ప్రతీ రోజు ఓ కొత్త విషయం నేర్చుకునే విధంగా పిల్లలను మార్చాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో కూడా అలా టీవీ వంటివి చూడనివ్వకుండా ఏదైనా పనులు అప్పగించండి. ఇలా చేయడం వల్ల వారికి కొత్త విషయాలు నేర్చుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీంతో జీవితంలో ఎలాంటి విషయంలో అయిన ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. ఏదైనా పని చేసిన కూడా సరిగ్గా చేయకపోయిన, ఓడిపోయిన నిరుత్సాహ పడవద్దని చెప్పండి. ఎందుకంటే ఓటమి ఎప్పుడూ శాశ్వతం కాదని తెలపండి. జీవితంలో విజయం సాధించాలంటే ఎవరితోనైనా ఓడిపోవడం చాలా ముఖ్యమని.. ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలపండి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.