Truth About Narcissism: నేను త్వరలో ఇల్లు కొనుగోలు చేస్తా.. కొత్త కారు కొనాలని అనుకుంటున్నాను.. మరికొన్ని రోజుల్లో వ్యాపారం చేస్తా.. మరో రెండు నెలల్లో విదేశాలకు వెళ్తా.. ఇలాంటి మాటలు కొందరు చెబుతూ ఉంటారు. కానీ ఆ తర్వాత వారి పనుల్లో ఆటంకాలు తలుగుతూ ఉంటాయి. దీంతో వారు తాము చేసే పనిపై నరదృష్టి పడిందని అనుకుంటూ ఉంటారు. కొంతమంది దీనిని నమ్మవచ్చు.. మరికొందరు నమ్మకపోవచ్చు.. కానీ వారు చేసే పనుల్లో ఆటంకం జరగడం మాత్రం వాస్తవం. ఇలా ఆటంకం ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే?
నరదృష్టి గురించి చాలా మంది చెబుతూ ఉంటారు. కొందరి దృష్టి తమపై బాగాలేదు.. అందుకే అనుకున్న పని చేయలేకపోతున్నా.. అని అంటూ ఉంటారు. దీంతో ఆ తర్వాత కొందరు వారు చేసే పనులు చెప్పకుండా ఉంటారు.. అలా చెప్పని పనులు చివరి వరకు విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో వారు చెప్పే మాట ఏంటంటే.. ముందే చెబితే నరదృష్టి తగులుతుంది.. అందుకే చెప్పలేదని సన్నిహితులతో అంటూ ఉంటారు. నర దిష్టి కొంతమంది నమ్మినా.. మరి కొంతమంది నమ్మకపోయినా.. ఏదైనా పనిని ప్రారంభించేముందు ఇతరులకు చెప్పకపోవడం అనేది వాస్తవం. ఈ విషయం కొందరికి సిల్లిగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం.
ఏదైనా ఒక పనిని ప్రారంభించేముందు ఇతరులకు చెపితే ఆటంకాలు రావడం కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మన చుట్టూ ఉన్న మనుషులు ఎంతమంది మంచివారు ఉన్నారు? అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపుగా మనం ఎదిగితే సపోర్ట్ చేసేవారు తక్కువే ఉంటారు. మన ఎదుగుదలను తగ్గించేవారు చాలామంది ఉంటారు. ఈ క్రమంలో మనం చేసే ఏ పని అయినా దానికి ఆటంకాలు సృష్టించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మనకు నచ్చని వారు ఏ చిన్న అవకాశం వచ్చినా.. పనులను చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. అలా ఒక వ్యక్తి అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయలేక పోతాడు. ఇంకొందరు అయితే కావాలనే పనులకు ఆటంకం సృష్టించి జరగకుండా చేస్తారు. ఇది వారికి పాత కక్షలు కావచ్చు.. లేదా తరతరాల నుంచి నచ్చని వ్యక్తులు కావచ్చు.
అందువల్ల ఒక పనిని ప్రారంభించేముందు ఎవరికి చెప్పకపోవడమే మంచిది. ఒక పనిని అనుకొని దానిని పూర్తి చేసే వరకు ఎంత సీక్రెట్ గా ఉంటే అంత మంచిది అని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పని పూర్తయ్యే వరకు నిత్యం శ్రమిస్తూ ముందుకు వెళ్లాలి. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా చేసే పనిని పూర్తి చేయాలి. మంచి, చెడు అనేది తర్వాత తెలుస్తుంది. మీరు చేసేది న్యాయమైన పని అయితే కచ్చితంగా మంచే అవుతుంది. అయితే కొందరు ఇది మంచిది కాదు అని చెబుతూ ఉంటారు.. చెప్పేవారి వ్యక్తిత్వాన్ని బట్టి అది మంచో.. చెడు మనమే నిర్ణయించుకోవాలి. అంతేకానీ ప్రతి వ్యక్తి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు.