Husband And Wife Relation: ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలతో పాటు అప్పుడప్పుడు వచ్చే జగడాలు, గొడవలు వారి మధ్య బంధాన్ని మరింత పెంచుతాయి. అయితే ముఖ్యంగా భర్తల విషయంలో భార్యలు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పనులను అస్సలు చేయకూడదు. భార్యలు తరచుగా భర్తల బలహీనతలను తల్లికో, తోబుట్టువుకో చెప్తూ ఉంటారు. అవి అక్కడితే ఆగితే ఫర్వాలేదు. కానీ వాళ్లు మళ్లీ ఆ విషయాలను భర్తల దగ్గర ప్రస్తావిస్తే భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడటం ఖాయం. ఎందుకంటే భర్త పరువు పోతే భార్య పరువు పోయినట్లే.

Also Read: Chanakya Neethi: స్త్రీ గురించి చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?
అంతేకాకుండా భార్యలు ఎంతసేపు భర్తలను ఆ పనులు చేయాలి.. ఈ పనులు చేయాలని ఒత్తిడి చేయరాదు. చాలా మంది భార్యలు ఆఫీస్ పనులతో పాటు ఇంటి పనులు చేయడం లేదని కస్సుబస్సులాడుతూ ఉంటారు. మీ అవసరం కోసం, మీ కోరికల చిట్టా తీర్చడానికి భర్తపై శృంగారాన్ని ఎరవేయకండి. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఎవరో వచ్చి తీరుస్తారు లేదా ఏదో పుస్తకంలో ఉండే చిట్కాలను పాటించాలని ఎదురుచూడకండి. మీ భర్తతో గొడవ పడిన విషయంపై మీకు పశ్చాతాపం ఉంటే మీరే ముందుగా క్షమాపణ చెప్తే అక్కడితో గొడవ సద్దుమణుగుతుంది.
ఒకవేళ తప్పు మీది కాకపోతే మీ భర్త ఏం తప్పు చేశారో పెద్దగా అరవకుండా ఫోన్‌లో సందేశం రూపంలో లేదా పేపర్‌పై రాసి మీ భర్తకు అందేలా చూడండి. అది చూసి ఆయనలో పశ్చాత్తాపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది భార్యలు భర్తలతో గొడవపడేది డబ్బుల విషయంలోనే. తిట్టి బాధపడేకంటే ముందే ప్రతినెల ఇంటి ఖర్చుల గురించి ఇద్దరు కూర్చుని చర్చించుకుని డబ్బుల విషయంలో సమస్యలను పరిష్కరించుకోండి.

అలాగే ఇంటికి ఎవరైనా మీ బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు మీ భర్త అభిప్రాయాలను కూడా మీరే మాట్లాడకండి. అతడు మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వండి. అతడి నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తే బయటివారి ముందు మీ భర్త చులకన అయ్యే ప్రమాదముంది. అలాగే మీ భర్త మైండ్‌ను మీరు చదివే ప్రయత్నం చేయకండి. ప్రతి విషయం మీరు ముందుగా చెప్పేస్తే.. మీ భర్త మీతో పంచుకోవాల్సిన విషయం మరుగున పడే ఛాన్స్ ఉంటుంది. మీకు ఏదైనా కావాల్సి వస్తే మీ భర్తతో క్లారిటీగా చెప్పండి. అతడే గుర్తించి ఆ పని చేయాలని నియమం పెట్టుకోవద్దు. ఎప్పుడైనా బయటి విషయాల పట్ల మీ భర్త కోపంగా ఉంటే అతడిని ఇంకా రెచ్చగొట్టకండి. కావాలంటే అతడిని శాంతపరిచేలా ప్రేమతో వ్యవహరించండి.
Also Read: Dharmashastra : ధర్మ శాస్త్రం ప్రకారం పురుషుడు భార్యతో ఏ విధంగా నడుచుకోవాలో తెలుసా?

[…] Also Read: భర్తల విషయంలో భార్యలు చేయకూడని ముఖ్య… […]