Hero Sumanth: సుమంత్.. సహజత్వానికి నిలువెత్తు నిదర్శనం, చిన్న హీరో కూడా స్టార్ హీరో అవ్వాలని ఆశ పడతాడు. కానీ, తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ స్టార్ డమ్ ను ఏ మాత్రం పట్టించుకొని హీరో సుమంత్. అందుకే, సాధారణ హీరోలకు సుమంత్ నిజమైన ఆదర్శం. ప్రతి పాత్రలోనూ తన ముద్ర కంటే.. ఆ పాత్ర ప్రతిభ మాత్రం చూపించాలి అనుకునే ఏకైక హీరో.. సుమంత్.
అలనాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు కి స్వయానా మనవడు అయినా.. ఎన్నడూ అక్కినేని ఫ్యామిలీ సాయం కోరని సినీ కార్మిక హీరో కూడా సుమంతే. మొదట్లో హీరోగా గుర్తింపు రాకపోయినా.. తనలోని ప్రతిభనే నమ్ముకొని హీరోగా సక్సెస్ అయిన అసలు సిసలు హీరో సుమంత్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకునే హీరోలు అతి తక్కువగా ఉన్న ఈ జనరేషన్ లో సుమంత్ లాంటి విభిన్నమైన చిత్రాలు అందించే హీరో ఉండటం నేటి ప్రేక్షకులకు దక్కిన రిలీఫ్.
Also Read: Puneeth Rajkumar james movie Review: రివ్యూ : ‘జేమ్స్’
అందుకే, తొలినాళ్లలో సుమంత్ పెద్ద స్టార్ హీరో అవుతాడని కలలు కన్నారు. అక్కినేని అభిమానులు అయితే.. ఏఎన్నార్ నిజమైన వారసుడు సుమంత్ మాత్రమే అంటూ కటౌట్ లు కూడా పెట్టారు. కానీ స్వయంకృతం తో చేసిన కొన్ని పొరపాట్లు కావొచ్చు.. లేదా తన అభిరుచికి తగ్గట్టు వద్దు అనుకున్న సినిమాలు కావొచ్చు.. సుమంత్ స్టార్ కాదు కదా, కనీసం హీరోగా కూడా సరైన మార్కెట్ తెచ్చుకోలేకపోయాడు.
అద్భుతమైన సినిమాలు చేతి వరకు వచ్చినా చేజార్చుకున్న ఏకైక హీరో కూడా సుమంతే. సుమంత్ వదిలేసిన సినిమాలు.. ఒకవేళ వదిలేయకుండా చేసి ఉండి ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో సుమంత్ నెంబర్ వన్ హీరో అయ్యి ఉండేవాడు. ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమా కథ ముందుగా సుమంత్ దగ్గరకే వచ్చింది.
ఈ కథ కూడా సుమంత్ కి నచ్చలేదు. పూరీకి నో చెప్పాడు. మహేష్ బాబు చేశాడు. ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత పూరి సుమంత్ కి మరో కథ చెప్పాడు. అదే ‘దేశముదురు’ కథ. ఈ కథ విన్న సుమంత్.. ఇది అస్సలు బాగాలేదు అంటూ నిర్మొహమాటంగా ఈ సినిమా చేయడానికి నో చెప్పాడు. ఆ తర్వాత ఈ సినిమా అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ఆ తర్వాత ఇడియట్ సినిమాను కూడా పూరి ముందు సుమంత్ కే చెప్పాడు. ఎందుకో తెలియదు కానీ, పూరీ చెప్పిన ప్రతీ కథకు సుమంత్ మాత్రం కనెక్ట్ కాలేకపోయాడు. అలా ఇడియట్ సినిమాను కూడా సుమంత్ వదులుకున్నాడు. ఈ సినిమా చేసిన రవితేజ, మాస్ మహారాజా అంటూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి అప్పుడు పూరి నెంబర్ వన్ డైరెక్టర్. పూరి సుమంత్ తో సినిమా చేయాలని చాలా తపన పడ్డాడు. కానీ సుమంత్ చేయలేదు.
Also Read: Bheemla Nayak 20 Days Collections: 20 రోజులు అవుతున్నా పవర్ తగ్గలేదు.. దటీజ్ పవన్ !