Jobs: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 48 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్), అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ & స్విచింగ్) ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ వల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుండటం గమనార్హం. ఎస్బీఐ వెబ్ సైట్ ద్వారా అర్హులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. ఎస్బీఐ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్ సైట్ హోమ్ పేజీలో ఉద్యోగ ఖాళీలపై క్లిక్ చేసి అందులో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
2022 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు విషయంలో ఫీజు మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి.
జనరల్, ఓబీసీ, ఈఎడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రం దరఖాస్తు ఫీజుగా 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. డిగ్రీ ఫస్ట్ డివిజన్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే అర్హతను కలిగి ఉంటారు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
[…] Samantha: సమంత ఆలోచనా విధానం ఈ మధ్య బాగా మారిపోయింది. నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత ఇలా మారిపోతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. గతం తాలూకు జ్ణాపకాలను తలుచుకుంటూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటుంది సమంత. ఏది ఏమైనా తాను సరికొత్త ప్రయాణం మొదలు పెట్టాను అని, భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తున్నాను అని సామ్ చెబుతుంది. […]