Snake bite- Precautions: పాము కాటు గురించి, దాని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారి గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. మన చుట్టూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. సరైన సమయానికి చికిత్స అందక ప్రాణాలు విడుస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే పాము కరిచిన సమయంలో లో కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటే బాధితుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.

పాము కరిచిన వారు ఎలాంటి ఆందోళన చెందవద్దు. భయపడకుండా ప్రశాంతంగా మనసును ఉంచుకోవాలి. పాము కాటేసిన వారికి వెంటనే వైద్య సదుపాయం అందించేలా చూడాలి. ముందుగా వారికి యాంటీ వీనమ్ మందు ఇవ్వాలి. ఇది పాము విషాన్ని ఒకచోట నిర్బంధించడం తో పాటు రక్తం పాయిజన్ కాకుండా చూస్తుంది. అంతేకాకుండా బాడీలో నాడీవ్యవస్థ లాంటి అనారోగ్య సమస్యలు వెంటనే ఉత్పన్నం కాకుండా నిరోధిస్తుంది.
Also Read: ఏపీ రాజధానిగా అమరావతి.. గుర్తిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
పాము కాటేసిన చోట శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఆ చోట ఏదైనా క్లాత్ తో గట్టిగా ముడి వేసుకోవాలి. అక్కడ ఏదైనా రింగు లేదా వాచ్ లాంటివి ఉంటే వెంటనే తీసేయాలి. పాము కాటేసిన చోట ఏమైనా వాపు లాంటిది వస్తే అక్కడ ఎలాంటి గాయాలు గాని చేయకూడదు.
లక్షణాలు కనిపించట్లేదు కదా అని ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వీలైతే దూరం నుంచి అయినా కాటేసిన పాము ఫొటో తీసుకుంటే వైద్యం అందించడం చాలా ఈజీ అవుతుంది. చాలామంది కాటేసిన చోట నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇది చాలా ప్రమాదకరం ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు. పాము కాటు వేసిన బాధితులు ఎలాంటి ఆందోళన చెందకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే త్వరగా కోలుకుంటారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో ఈజీగా ప్రమాదం నుంచి బయట పడవచ్చు. ఆందోళనతో ఏవేవో చేసి ప్రాణాలమీదికి తెచ్చుకోకుండా ప్రథమ చికిత్స అనే విధానాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
Also Read: నాయీ బ్రాహ్మణులతో పెట్టుకున్న మోహన్ బాబు.. ఈసారి ఏమవుతుందో ?