Krithi Shetty: ‘కృతి శెట్టి..’ తెలుగు వెండితెర పై తాజాగా నీరాజనాలు అందుకుంటున్న కొత్త భామ. ఉప్పెన సినిమాలో బేబమ్మగా నటించి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ భామ నటన చూసి ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్ హీరోలు సైతం ఎవరు ఈమె అని అడిగి తెలుసుకునేలా నటించి మెప్పించింది. దాంతో తెలుగులో ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయింది కృతి . స్టార్ హీరోయిన్ హోదా కాదు.. దానికి మించిన క్రేజ్ ను అందుకుంది కృతి. ఈమె కోసం ఇప్పుడు హీరోలు వేచి చూస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కోట్లు కురిపిస్తున్నారు.

ఉప్పెన తర్వాత మరో రెండు విజయాలు అందుకుని హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది కృతి శెట్టి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కూడా విజయం సాధించాయి. దాంతో కృతి డేట్స్ ఇప్పుడు హాట్ కేక్ అయిపోయాయి. చాలా మంది నిర్మాతలు కృతి గోల్డెన్ లెగ్ అంటూ ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారు. అందుకే స్టార్ నిర్మాతలు సైతం కృతి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.
Also Read: కేజీఎఫ్ 2కు పోటీగా వస్తున్న మరో సినిమా..!
ఇప్పటివరకూ సినిమాలో నటించడానికే రెండు కోట్లు డిమాండ్ చేస్తోన్న ‘కృతి శెట్టి’, తాజాగా రెమ్యునరేషన్ ను డబుల్ చేసింది. రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది. మరో రెండు మూడు హిట్లు వస్తే.. నాలుగు కోట్లు చేయడానికి కృతి బాగా ఇంట్రెస్ట్ గా ఉందట. ఇక కృతి శెట్టి గురించి ఓ సీక్రెట్ ఏమిటంటే.. ఆమె హీరోయిన్ అవ్వడానికి కారణం ఆమె తల్లి అట. ఆమె తల్లికి సినిమాల్లో నటించాలనే ఆశ ఉండేది.
కానీ ఆ ఆశ ఆశగానే మిగిలిపోవడంతో.. తన కూతురు ద్వారా తన కోరిక నెరవేర్చుకుంది. చాలా ప్లాన్డ్ గానే కృతి శెట్టికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అండ్ నటనలో శిక్షణ ఇప్పించింది ఆమె తల్లి.
Also Read: సమంతకి మరో క్రేజీ ఆఫర్.. తగ్గదే లే అంటున్న సామ్ !