Saturn Transit 2022: గ్రహాల దిశ ప్రకారమే జాతకాలు మారతాయి. జీవితంలో ఎదగాలంటే గ్రహాల అనుకూలత కావాలి. దీని కోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు మనకు చెడు ఫలితాలు ఇచ్చే గ్రహం శని అని నమ్ముతుంటారు. అందుకే శని అనుగ్రహం కోసం కూడా నిత్యం పూజలు చేయడం తెలిసిందే శని కష్టాలను మాత్రమే తెస్తాడని నమ్మకం. అందుకే శని కోసం కూడా జనం తెగ భయపడుతుంటారు.జీవితంలో ఎదురయ్యే బాధలను తప్పించుకునేందుకు శని అనుగ్రహం ఉండాలని తాపత్రయపడుతుంటారు.

ప్రతి రాశిలో శని రెండున్నరేళ్లు ఉంటాడు. దీంతో ఆ సమయంలో ఆ రాశి వారికి కష్టాలు తప్పవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శని జూన్ 5 శనివారం నుంచి కుంభరాశిలో ఉండనున్నాడు. దీంతో జులై 12 ముందు దశలో కుంభ రాశి నుంచి మకర రాశిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరునెలల్లో అనేక మార్పులు సంభవిస్తాయి.
ఏప్రిల్ 29న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన తరువాత ధనుస్సు రాశి వారికి విముక్తి లభించింది. జులై 12న శని మకర రాశిలోకి ప్రవేశిస్తున్నందున ధనుస్సు రాశి వారికి జులై 12 నుంచి 2023 జనవరి 17 వరకు కష్టంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ కాలంలో మిథున, తుల రాశుల వారికి కూడా శని గ్రహ ప్రభావం ఉంటుంది.

మకర, కుంభ రాశుల వారికి కూడా ప్రమాదకరమే. కర్కాకం, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ కాలంలో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. దీంతో శని గ్రహం నుంచి తప్పించుకోవడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో కూడా సూచిస్తున్నారు. మొత్తానికి శని ప్రభావం నుంచి తప్పించుకోవాలని ఈ రాశుల వారు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శని గ్రహ అుకూలత కోసం పూజలు చేస్తున్నారు.
Also Read:CM KCR: కేసీఆర్ మళ్లీ మౌనం.. ఈసారి ఎవరికి మూడుతుందో?