Samantha : సౌత్ ఇండియా లో స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు సమంత. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ తోనే స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టిన ఈమె, సౌత్ ఇండియా లో ఉన్న సూపర్ స్టార్స్ అందరితో కలిసి నటించి, ఎన్నో సంచలనాత్మక విజయాలను అందుకొని నెంబర్ 1 హీరోయిన్ గా నిల్చింది. ఆ సమయంలోనే ఆమె నాగ చైతన్య తో విడిపోవడం, విడిపోయిన తర్వాత ఆమె ఎంతో మానసిక వేదనకు గురి అవ్వడం, ఆ తర్వాత ఆమెకు మయోసిటిస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకడం వంటివి జరిగాయి. ఒకేసారి ఇన్ని కష్టాలను సమర్థవంతంగా ఎదురుకొని, కోట్లాది మంది మహిళలకు ఆదర్శంగా నిల్చిన సమంత, మళ్ళీ సినిమా షూటింగ్స్ తో బిజీ గా మారిన సంగతి తెలిసిందే. ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ, మరోపక్క ఆమె షూటింగ్ లో పాల్గొన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు తో పాటుగా ఇతర ప్రాంతీయ మరియు ఫారిన్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ సంస అందించిన నివేదిక ప్రకారం ఈ వెబ్ సిరీస్ 200 కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ అవుతుందట. అందులో 150 కి పైగా దేశాల నుండి జనాలు ఈ సినిమాని వీక్షిస్తున్నారట. ఆ 150 దేశాల్లోనూ ఈ సిరీస్ టాప్ 10 లో ట్రెండ్ అవుతుందట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి సంచలనాత్మక రెస్పాన్స్ వచ్చింది అనేది. అమెజాన్ ప్రైమ్ హిస్టరీ లో ఒక వెబ్ సిరీస్ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం చాలా అరుదుగా జరిగిందట. ఆ జాబితాలో ‘సిటాడెల్’ చిత్రం కచ్చితంగా నిలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. వ్యూస్ పరంగా కూడా ఈ వెబ్ సిరీస్ ఆల్ టైం రికార్డుని నెలకొల్పే అవకాశం ఉందట.
ఇప్పటికే సమంత కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబడ్డ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ తో గ్లోబల్ వైడ్ గా అద్భుతమైన రీచ్ వచ్చింది. ఈ సిరీస్ లో ఆమె విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో ఒక RAW ఏజెంట్ గా యాక్షన్ సన్నివేశాలు చేస్తూ, ఒక తల్లిగా ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది సమంత. అలాగే యూత్ ఆడియన్స్ వెర్రెక్కిపోయేలా ఆమె రొమాంటిక్ హాట్ సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయి మరీ నటించింది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంతానే కనిపిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఈ సిరీస్ తర్వాత ఆమె రేంజ్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది.