
గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న పేరు అర్జున్ టెండూల్కర్.ఈ ఏడాది IPL లో ముంబై ఇండియన్ తరుపున ఆడుతున్న ఆయన,ముంబై ఇండియన్స్ టీం అతి క్లిష్టమైన సమయం లో ఉన్నప్పుడు రెండు ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాచ్ గెలుపునకు కారణమయ్యాడు.అప్పటి నుండి అర్జున్ టెండూల్కర్ పేరు సోషల్ మీడియా లో మారు మోగిపోతుంది.
తండ్రికి తగ్గ తనయుడు అంటూ అందరూ ఆయనని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.ఇది ఇలా ఉండగా అర్జున్ టెండూల్కర్ కి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ కి దారి తీసింది.అర్జున్ టెండూల్కర్ ఇద్దరు అమ్మాయిలతో కలిసి లంచ్ డేట్ కి వెళ్తున్న ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇంగ్లాండ్ దేశానికీ చెందిన మహిళా క్రికెటర్ దానిల్లే వాట్ తో కలిసి అతను ఫోటోలు దిగాడు.
దానిల్లే వాట్ కి ఇటీవలే ప్రముఖ జార్జ్ హొగ్దే తో నిశ్చితార్థం అయ్యింది , త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.అయితే చిన్న తనం నుండి అర్జున్ టెండూల్కర్ దానిల్లే వాట్ కి మంచి స్నేహితుడని దానిల్లే వాట్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

2009 వ సంవత్సరంలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో అర్జున్ తన తండ్రి సచిన్ తో కలిసి నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయం లో వెళ్లి కలిశానని, అప్పుడు ఏర్పడిన పరిచయం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చింది దానిల్లే వాట్.మేము ఇద్దరం కలిసి చాలా సార్లు నెట్ ప్రాక్టీస్ లో క్రికెట్ ఆడుకున్నామని,అర్జున్ లో మీరందరూ కేవలం బౌలర్ ని మాత్రమే చూసారు, కానీ అతని గొప్ప బ్యాట్స్ మెన్ కూడా.అర్జున్ తన తండ్రిలాగా ఈసారి నుండి బ్యాటింగ్ లో కూడా ఆడాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది దానిల్లే వాట్.