Homeక్రీడలుCaptain Powell : పసివాడి కోసం తన ప్రాణం మీదకు తెచ్చుకున్న కెప్టెన్.. ఈ క్రికెటర్...

Captain Powell : పసివాడి కోసం తన ప్రాణం మీదకు తెచ్చుకున్న కెప్టెన్.. ఈ క్రికెటర్ ధైర్యానికి సలాం

 

వెస్టిండీస్ కెప్టెన్ రావ్ మెన్ పావెల్
వెస్టిండీస్ కెప్టెన్ రావ్ మెన్ పావెల్

 

Captain Powell : క్రికెట్లో గాయాలు అత్యంత సహజం. గాయాలు బారిన పడినప్పటికీ కోలుకొని ఆటాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుకోని గాయాలు ఆటగాలను ఇబ్బందులకు గురి చేసుకుంటాయి. తాజాగా వెస్టిండీస్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్లో వెస్టిండీస్ టీమ్ కెప్టెన్ పావెల్ కు అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది. ఓ చిన్నారి ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో తన ప్రాణాలు మీదకు తెచ్చుకునే సాహసానికి ఒడిగట్టాడు పావెల్.

క్రికెట్ లో గాయాలు చాలా సహజం. కానీ, ఒక్కోసారి ఆటగాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో గాయాలు అవ్వాల్సి వస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికా – వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఘటన జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కూడా చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 258 పరుగులు చేసింది. కానీ ఈ మ్యాచ్లో సౌతాఫ్రికానే విజయం వరించింది.

చేధనలో అదిరిపోయే ఆరంభం..

భారీ లక్ష శాతంతో బరిలోకి దిగిన సఫారీలకు అదిరిపోయే ఆరంభం లభించింది. వింటుంది కాకు 43 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ మూడో వార్డులో అకిల్ హొస్సేన్ వేసిన బంతిని లాంగ్ ఆఫ్ వైపు డికాక్ బాదాడు. దీన్ని ఆపేందుకు వెస్టిండీస్ కెప్టెన్ రావ్ మెన్ పావెల్ వేగంగా పరుగు తీశాడు. డైవ్ చేస్తే బంతి బౌండరీ వెళ్లకుండా ఆపే అవకాశం కనిపించింది. కానీ పావెల్ డైవ్ చేయలేదు. ఎందుకంటే బంతిని పట్టుకోవడానికి ఐదేళ్ల పసివాడు బౌండరీ లైన్ దగ్గరకు వచ్చి ఉన్నాడు.

డైవ్ చేయకుండా ఆపే ప్రయత్నం..

బంతి వైపు పరుగు తీసిన పావెల్ డైవ్ చేయలేదు. తాను డైవ్ చేస్తే ఆ పసివాడిని ఢీకొట్టడం ఖాయమని అర్థమైంది. దీంతో డైవ్ చేయకుండా బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే చాలా వేగంగా వస్తుండడంతో అతను పూర్తిగా కంట్రోల్ తప్పాడు. అయితే పిల్లవాడికి తగలకుండా పసివాడి పైనుంచి ముందుకు దూకాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న ఎల్ఈడీలను బలంగా తాగాడు. అక్కడితో ఆగకుండా వాటి పైనుంచి అవతలకు వెళ్లి అక్కడ ఉన్న స్టీల్ పైపులను కూడా ఢీకొట్టాడు.

నొప్పితో విలవిల్లాడిన పావెల్..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ గాయంతో పావెల్ వెంటనే మైదానంలోకి రాలేకపోయాడు. బౌండరీ లైన్ పక్కనే పడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. జట్టు ఫిజియోలు వచ్చి అతనికి చికిత్స అందించారు. ఆ తరువాత కొద్దిసేపటికి చేరుకున్న అతను మళ్ళీ మైదానంలోకి అడుగు పెట్టాడు. ఈ మ్యాచ్ లో రీజా హెండ్రిక్స్, హేన్రిక్ క్లాసేన్, డేవిడ్ మిల్లర్ సహా జట్టు బ్యాటర్లంతా రాణించడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ టి20 మ్యాచ్లో ఏకంగా 517 పరుగులు నమోదు కావడం గమనార్హం.

 

RELATED ARTICLES

Most Popular