Rose Sherbet : ఒక్క గులాబీ పువ్వును ఇచ్చి కూడా ప్రేమను ప్రపోజ్ చేయవచ్చు. వెల్ కమ్ చెప్పాలి అంటే కూడా ఒక్క గులాబీ ఉంటే చాలు. ఇక అమ్మాయిలకు అయితే ఈ గులాబీలు అంటే చాలా ఇష్టం. అలా హెయిర్ లూజుగా వేసుకొని ఒక గులాబీ సైడ్ కు పెట్టుకుంటే పాత కాలం హీరోయిన్ ల మాదిరి భలే అందంగా ఉంటారు కదా. అయితే ఈ గులాబీ పువ్వులు అంటే సాధారణంగానే అందరికీ ఇష్టం. ఈ పూల నుంచి మంచి సువాసన వస్తుంటుంది. అయితే ఎక్కువగా ఈ పూలను దేవుని పూజకు వినియోగిస్తుంటారు.
అయితే గూలాబీలు అందం, పూజ కోసం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. చర్మం, జుట్టు సమస్యలకు గులాబీలను వినియోగిస్తారు అని మీకు తెలుసా? అయితే గులాబీలతో ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. గులాబీ రేకులను ఎండ బెట్టి బిర్యానీ వంటి వంటల్లో కూడా వినియోగిస్తారు. వీటితో ఎంతో రుచికరమైన షర్బత్లు కూడా తయారు చేసుకోవచ్చు. అందులో ఒకదాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చ కూడా. మరి ఈ రోజ్ షర్బత్ తయారీకి ఎలాంటి పదార్థాలు కావాలి? ఎలా తయారు చేయాలి వంటి వివరాలు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
గులాబీ రేకులు, యాలకుల గింజలు, నిమ్మరసం, దానిమ్మ గింజల రసం, పంచదార వంటి పదార్థాలతో గులాబీ షర్బత్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారీ విధానం కూడా చూసేద్దాం.
రోజ్ షర్బత్ తయారీ విధానం:
ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా చేయాలి. రోట్లో వేసి లేదా మిక్సీలో వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దను ఓ లోతైన గిన్నెలోకి తీసుకొని ఇందులో మరిగించిన నీళ్లను వేసి కలపాలి. ఆ తర్వాత యాలకుల గింజలు వేయాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు కలిపి మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయం మరో గిన్నె తీసుకుని పల్చని వస్త్రం లేదా టీ స్టైనర్ తో వడపోయాలి.
ఈ నీటిలో పంచదార కలపాలి. పంచదార కరగకపోతే వేడి నీటిలో రోజ్ వాటర్ ఉన్న గిన్నె పెట్టి కరిగించుకుంటే కూడా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో దానిమ్మ గింజల రసం, నిమ్మరసం, కూలింగ్ వాటర్ వేయాలి. ఐస్ క్యూబ్స్ వేసి కూడా కలపుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాల్సిన ఎంతో రుచిగా ఉండే రోజ్ వాటర్ సిద్ధం అయింది. ఇది చాలా రుచిని అందిస్తుంది. ఎండా కాలం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంకా చియా సీడ్స్, సబ్జా గింజలు వేసి కూడా మీరు సేవించవచ్చు.