Rohit Sharma: పట్టిందల్లా బంగారమే అనే సామెత మీకు గుర్తుంది కదా. ఈ సామెత ఇప్పుడు రోహిత్ శర్మకు బాగా వర్తించేలా ఉంది. ఏ ముహూర్తాన టీమ్ ఇండియా పగ్గాలు తీసుకున్నాడో గానీ.. వరుసగా రెండు సిరీస్‌లను నెగ్గి తానే బెస్ట్ అనిపించుకునే పనిలో పడ్డాడు. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీని అనూమ్యంగా టీమ్ ఇండియా కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను రోహిత్‌కు బీసీసీఐ అప్పగించడం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.

గతంలో ఏ కెప్టెన్ ఇలా విమర్శల నడుమ బాధ్యతలను తీసుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న కెప్టెన్ రిటైర్ అయితేనో లేదంటే.. వరుసగా వైఫల్యాలు వస్తేనో మార్చారు. కానీ విరాట్ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో ఆయన్ను మార్చడంతో బీసీసీఐ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా ఆ బాధ్యతలను రోహిత్ సమర్థవంతంగా పూర్తి చేయలేడనే వాదన కూడా బాగానే వినిపించింది. కానీ ఇలాంటి విమర్శలకు చెక్ పెడతూ రోహిత్ తానేంటూ నిరూపించుకున్నాడు.

ఐపీఎల్‌లో గెలిచినంత మాత్రాన ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గెలవలేడన్న వారికి గట్టి సమాధానమే చెప్పాడు రోహిత్. మొన్న న్యూజిలాండ్ మీద వన్డే సిరీస్ నెగ్గి భారత్‌కు తన కెప్టెన్సీలో మొదటి విజయాన్ని అందించాడు. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ మీద కూడా ఇలాంటి మ్యాజిక్ చేసి చూపించాడు. అయితే వాస్తవానికి లాస్ట్ వన్డే లో కేవలం 237 పరుగులే చేసినా.. దాన్ని కాపాడుకోగలిగాడు రోహిత్. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించడంలో ఆయన కెప్టెన్సీ బాధ్యత బాగానే నిర్వర్తించాడు.
Also Read: జగన్-చిరు టీం భేటి: టాలీవుడ్ కు ఈసారి వరాలు ఖాయం
కేవలం 193 పరుగులకే వెస్ట్ ఇండీస్ ఆల్ ఔట్ అయ్యింది వెస్ట్ ఇండీస్. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే.. రోహిత్ రివ్యూలకు వెళ్లినప్పుడల్లా కలిసి రావడం. గతంలో ఇలాగే రివ్యూలకు కోహ్లీ వెళ్తే చాలా సార్లు నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. మరి రోహిత్ అదృష్టమో మరొకటో తెలియదు గానీ.. ఇలా ఏ రకంగా చూసినా ప్లేయర్ల నుంచి కూడా పూర్తి సహకారం రోహిత్‌కు లభిస్తోంది.
విదేశీ గడ్డల మీద విజయాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా కెప్టెన్సీ తీసుకున్న తర్వాత వచ్చిన రెండు సిరీస్‌లను నెగ్గడమే రోహిత్‌కు విమర్శకుల ప్రశంసలు అందజేస్తోంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌కు ఇప్పటి నుంచే రోహిత్‌ను సమర్థవంతమైన కెప్టెన్ గా రెడీ చేయాలన్నది బీసీసీఐ ఆలోచన. మరి అనూహ్యంగా అంది వచ్చిన అవకాశాన్ని రోహిత్ సద్వినియోగం చేసుకుంటాడా లేదా అన్నది ఇంకొంత కాలం వేచి చూడాలి.
Also Read: మోడీ కామెంట్లు టీఆర్ ఎస్‌కు బూస్ట్ ఇస్తున్నాయా..?