India vs Sri Lanka 2022: రోహిత్ లక్ చూస్తుంటే.. ఇప్పుడు శ్రీలంకతో ఆడుతు్న టెస్టు సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేసేలాగే కనిపిస్తోంది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న టెస్టు సిరీస్ రెండో రోజు బ్యాటింగ్ లో ఇండియా దుమ్ము లేపింది. 9వికెట్ల నష్టానికి 303 రన్స్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ తో పాటు రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో ఇండియాకు భారీ స్కోరు దక్కింది.

దీంతో రెండు రోజుల్లో కలిపి టీమ్ ఇండియా 447 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది శ్రీలంక ముందు. ఈ రెండోరోజు ఆటలో శ్రేయస్ 67పరుగులు చేయగా.. రిషబ్ 50పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఇండియా తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి కేవలం 28 పరుగులే చేసింది. అయితే ఈ టెస్టు సిరీస్‌కు ఇంకా 3 రోజులు మిగిలి ఉంది.
Also Read: కంటోన్మెంట్ వార్: టచ్ చేసి చూస్తే కేటీఆర్ కు చుక్కలేనంటున్న ‘బండి’
శ్రీలంక గెలవాలంటే ఇంకా 419 రన్స్ కావాలి. ఇటు ఇండియా విజయానికి ఇంకా 9 వికెట్లు పడగొట్టాలి. ఇక రెండో రోజు ఇరు జట్లు కలిసి 14 వికెట్లు పడగొట్టాయి. అయితే టాప్ ఆర్డర్ ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే మరింత భారీ స్కోరు ఇండియాకు దక్కేదనే చెప్పుకోవాలి. అటు శ్రీలకం తరఫున బౌలింగ్ చేసిన ప్రవీణ్ జయవిక్రమ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ లసిత్ ఎంబుల్దేనియా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక తొలిరోజు ఆటలో శ్రీలంక చాలా తక్కువ పరుగులు చేసింది. కేవలం 109 పరుగులకే అన్ని వికెట్లు సమర్పించేసుకుని ఆలౌటైంది. మొదటి రోజు ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులు చేసి చెప్పుకోదగ్గ స్కోరును శ్రీలంకకు అందించాడు. ఆరోజు ఇండియా తరఫున బౌలింగ్ చేసిన బుమ్రా 5 వికెట్లు తీశాడు. ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ తలో 2 వికెట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక వికెట్ ను తీశాడు.
Also Read: దేనికైనా సత్తా ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే !