https://oktelugu.com/

Revanth Government: రేవంత్ ప్రభుత్వం పొదుపు మంత్రం.. ఉద్యోగులకు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భంలో రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉంది. కానీ.. ఆ తరువాత బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తరువాత అప్పుల మీద అప్పులు చేస్తూ వచ్చింది. పథకాల అమలుకు కావచ్చు.. అభివృద్ధి పనుల నిమిత్తం కావచ్చు.. ఇష్టారాజ్యంగా అప్పులు చేశారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 13, 2024 / 03:06 PM IST

    Revanth-Reddy

    Follow us on

    Revanth Government: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భంలో రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉంది. కానీ.. ఆ తరువాత బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తరువాత అప్పుల మీద అప్పులు చేస్తూ వచ్చింది. పథకాల అమలుకు కావచ్చు.. అభివృద్ధి పనుల నిమిత్తం కావచ్చు.. ఇష్టారాజ్యంగా అప్పులు చేశారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. పదేళ్ల పాటు అప్పులు పెరిగిపోయాయి తప్పితే.. తగ్గింది లేదు. ఏడాది క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.

    కాంగ్రెస్ కొలువుదీరే వరకు కూడా రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉందా అన్న విషయం పెద్దగా బయటకు రాలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. దాంతో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం పథకాలను అమలు చేయడానికి ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాకుండా.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చేందుకు నిధులు సరిపోవడం లేదు. దాంతో కొన్ని పథకాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ కొలువుదీరినప్పటి నుంచి పలు దుబారా ఖర్చులను తగ్గించుకుంది. అనవసర ఆర్భాటాలకు సైతం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    పొదుపు చర్యలు పాటిస్తూనే.. ఆర్థిక కష్టాల నుంచి మరింత బయటపడడానికి మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఇక నుంచి ఎవరు కూడా విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. సెమినార్లు, స్టడీ టూర్లు, కాన్ఫరెన్స్‌ వంటివి అన్నింటినీ బ్యాన్ చేసేసింది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే అత్యంత తక్కువ ఖర్చుతోనే హాజరుకావాలని ఆదేశించింది. ఇక వాహనాల వినియోగం, కొత్త వాహనాల కొనగోలులోనూ ఆంక్షలు పెట్టింది. కొత్త వాహనాల కొనుగోలను నిషేధించింది. వాహనాల రీప్లేస్‌మెంట్ కూడా వద్దని స్పష్టం చేసింది. ఇక ఆఫీసుల్లో విద్యుత్ వాడకంపైనా కీలక ఆదేశాలు ఇచ్చారు. అవసరం లేనప్పుడు, వాడనప్పుడు అన్ని ఉపకరణాలను ఆపేయాలన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత గాడ్జెట్స్ వినియోగంలోనూ పొదుపు పాటించాలన్నారు. వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు భారీగా తేడా వస్తుండంతో ప్రభుత్వం ఈ రకమైన చర్యలకు దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ఈ ఆదేశాలను చూసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ ఇంత ఘోరంగా తయారైందా అని సెక్రెటరియట్ ఉద్యోగుల్లోనే చర్చ మొదలైంది. అంచనాలకు తగినట్లుగా ఆదాయం సమకూరకపోవడంతో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయని అంటున్నారు. సాధారణంగా అప్పులు, ఇతర వనరులతోనే పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేయాలి. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి సమయం సరిపోతోంది. వచ్చిన ఆదాయం అంతా కూడా వడ్డీల చెల్లింపులకే పోతున్నట్లు ఇప్పటికే సీఎం, మంత్రులు స్పష్టం చేశారు. అందుకే.. మరికొన్ని పొదుపు సూత్రాలు పాటించాలని నిర్ణయించారు. ఖర్చులు తగ్గించుకునే పనినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.