Grocery Shops : కిరాణం షాపుల్లో ఈ వస్తువులను Returns ఇచ్చి.. ఉచితంగా కొత్త వస్తువు తీసుకోండి…

విజిలెన్ష్ అధికారులు వచ్చి నాసిరకం ప్రొడక్స్ వాడుతున్నట్లు తేలితే వెంటనే జరిమానా విధిస్తారు. ఒక్కోసారి షాప్ ను సీజ్ కూడా చేయొచ్చు. అందువల్ల వస్తువు నాసిరకం అని తేలితే దానిని వెంటనే తిరిగి ఇచ్చేయండి..

Written By: NARESH, Updated On : February 12, 2024 6:09 pm
Follow us on

Grocery Shops : నిత్యావసరాల కోసం ప్రతిరోజూ కిరాణ షాపుకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఇతర వస్తువులను కూడా కొంటాం. అయితే చాలా మంది తక్కువ ధరకు వచ్చే వస్తువులనే కొనుగోలు చేస్తుంటారు. నాణ్యమైన వస్తువుల గురించి పట్టించుకోరు. ఒక్కోసారి ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన తరువాత అది నాసిరకం అని తేలితే.. దానిని షాపు వాళ్లకు రిటర్న్ ఇవ్వొచ్చు. ఇలా వస్తువు నాసిరకం అని తేలితే కచ్చితంగా దాని స్థానంలో కొత్త వస్తువు ఇవ్వాల్సిందే. ఒకవేళ షాపు వారు తీసుకోను అన్నారంటే.. ఈ నెంబర్ కు కాల్ చేయాలి. అది నాసిరకం అని తేలితే భారీగా జరిమానా విధించడమే కాకుండా ఒక్కోసారి షాప్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఆ నెంబర్ ఏంటిదంటే?

సమాజంలో మంచి, రెండు రెండూ ఉంటాయి. కొందరు మంచి మార్గం ద్వారా జీవించాలనుకుంటారు. కొందరు అత్యాశతో.. స్వల్పకాలంలో డబ్బు అధికంగా సంపాదించాలనే ఉద్దేశంతో నాసిరకం వస్తువులను అంటగడుతారు. కొన్ని వస్తువులు ఉత్పత్తి చేసిన తరువాత అవి సేల్స్ కాకుంటే అలాగే మిగిలిపోతాయి. వీటిని ఎలాగైనా కస్టమర్లకు అమ్మాలని చూస్తారు. దీంతో వీటిని విక్రయించాలనుకొని తక్కువ ధరకు లేదా డిస్కౌంట్ ఆఫర్స్ కింద అమ్మేస్తారు. దీంతో చాలా మంది వినియోగదారులు తక్కువ ధరకు వస్తువులు వస్తున్నాయని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు.

చౌకగా వస్తువు లభిస్తుందంటే ఎవరైనా కాదనరు.కానీ ఒక్కోసారి ఇది నాణ్యమైనదా? లేదా? అనేది గుర్తించాలి. ముందుగా ఆ వస్తువు గడువు తేదీ ఎప్పుడుందో చూసుకోవాలి. లేదా ఆ వస్తువు తయారీ తేదీ నుంచి ఎప్పటి వరకు యూజ్ చేయొచ్చో చూసుకోవాలి. నిత్యావసర వస్తువులు కొన్ని పరిమిత కాలంలో మాత్రమే పనిచేస్తాయి. ముఖ్యంగా ద్రవ పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువుల నాణ్యమైనవని పైకి కనిపించినా.. ఇంటికెళ్లి చూశాక అవి పాడైపోయినట్లు కనిపిస్తాయి.

ఇలా నాసిరకం వస్తువు అని తేలినట్లయితే దానిని కొనుగోలు చేసిన షాప్ కు తిరిగి ఇచ్చేయాలి. అలా కొందరు తీసుకోవడానికి వెనకాడితే.. 1800114000 లేదా 1915 అనే నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వొచు. దీంతో విజిలెన్ష్ అధికారులు వచ్చి నాసిరకం ప్రొడక్స్ వాడుతున్నట్లు తేలితే వెంటనే జరిమానా విధిస్తారు. ఒక్కోసారి షాప్ ను సీజ్ కూడా చేయొచ్చు. అందువల్ల వస్తువు నాసిరకం అని తేలితే దానిని వెంటనే తిరిగి ఇచ్చేయండి..