Pawan Kalyan vs Allu Arjun : అల్లు మరియు మెగా ఫ్యామిలీ మధ్య రోజురోజుకి గ్యాప్ పెరిగిపోతూ ఉంది అనేందుకు ఇటీవల అనేక సంఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటుగా అల్లు అర్జున్ ని కూడా ఇష్టపడే అభిమానులు ఈ గొడవలకు ఎక్కడో ఒక దగ్గర ఆగితే బాగుండును అని కోరుకుంటున్నారు. కానీ గొడవ చల్లారింది అని అనుకునే ప్రతీసారీ ఎదో ఒక సందర్భం ఆ గొడవని మరింత రెట్టింపు అయ్యేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవి కోసం నంద్యాల కి వెళ్లినప్పటి నుండి ఈ గొడవకి భీజం పడింది. శిల్పా రవి వైసీపీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే అవ్వడమే అందుకు కారణం. అక్కడి నుండి సోషల్ మీడియా లో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి హోదాలో, కర్ణాటక ప్రభుత్వంతో కొన్ని కీలక సమస్యలకు సంబంధించి చర్చల కోసం వెళ్ళాడు.
ఆ సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ‘ఒకప్పుడు సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారు. కానీ ఇప్పుడు అడవులను దోచేసే పాత్రల్లో హీరోలు కనిపిస్తున్నారు’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ పుష్ప ని ఉద్దేశించి కాదని, ఆయన ప్రసంగం చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది. అభిమానులంటే కుర్రాళ్ళు, అర్థం చేసుకోలేరు, ఆవేశంగా ట్రోల్ల్స్ వేస్తారు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవచ్చు. కానీ ఏకంగా అల్లు అర్జున్ మామయ్య (స్నేహ రెడ్డి తండ్రి) ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ కేవలం సినిమాలో ఒక పాత్ర మాత్రమే చేసాడు అనే విషయం పవన్ కళ్యాణ్ కి తెలియదా..?, ఈ విషయంపై ఆయనే చొరవ తీసుకొని మాట్లాడాలి. తాను మాట్లాడింది పుష్ప సినిమాని ఉద్దేశించి కాదని అభిమానులకు క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే ఈ వివాదానికి తెరపడుతుంది. అల్లు అర్జున్ చాలా మంచి మనిషి. ఎప్పుడూ తన వాళ్లకు అండగా నిలబడాలనే తపనతో ఉంటాడు. అభిమానులు ఆయనని తప్పుగా అర్థం చేసుకోరని భావిస్తున్నాను’ అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆయన చూడాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటిది ఇంత చిన్న సమస్యపై స్పందిస్తాడా?, సోషల్ మీడియా లో నెలల తరబడి జరుగుతున్న వివాదాలకు అడ్డుకట్ట వేస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ మామయ్య మాట్లాడిన ఈ మాటలు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఉన్న గొడవలను మరింత పెంచాయి.