https://oktelugu.com/

Chiranjeevi : 64 మంది ప్రముఖులు ఉన్న విమానానికి ప్రమాదం.. అందులో చిరంజీవి, బాలయ్య, విజయశాంతి. ఇంతకీ ఏం జరిగింది?

కొన్ని ఘటనలు జీవితాంతం గుర్తుండి పోతాయి. వాటిని మర్చిపోవడం చాలా కష్టం. ఇదే విధంగా ఒకసారి చాలా మంది టాలీవుడ్ నటీనటులను భయపెట్టే ఒక సంఘటన జరిగింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 1, 2025 / 04:00 AM IST

    Chiranjeevi, Balayya, Vijayashanti

    Follow us on

    Chiranjeevi : కొన్ని ఘటనలు జీవితాంతం గుర్తుండి పోతాయి. వాటిని మర్చిపోవడం చాలా కష్టం. ఇదే విధంగా ఒకసారి చాలా మంది టాలీవుడ్ నటీనటులను భయపెట్టే ఒక సంఘటన జరిగింది. కాదు కాదు ప్రమాదం సంభవించింది. దాని గురించి ఇప్పటికీ ఎవరు తలుచుకున్నా సరే వణుకుతుంటారు. వామ్మో అనే వారే కానీ అయ్యో జస్ట్ అదా ఒక్కరు కూడా కామన్ గా అనుకోరు. ఇప్పటికి కూడా గుర్తుండి పోయేలా ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినా సరే ఆ సంఘటనను మాత్రం ఎవరు మర్చిపోలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే?

    అప్పుడు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉంది. షూటింగ్స్ మొత్తం అక్కడనే జరిగేవి. కేవలం హైదరాబాద్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. ఇక నటులు అందరూ కూడా అక్కడే ఉండేవారు. రావాలంటే ఇక్కడికి వచ్చి వెళ్లే వారు కానీ మకాం మాత్రమే అక్కడే ఉండేది. అయితే ఓ రోజు దీపావళి పండుగ వచ్చింది. దీపావళికి అని స్టార్లు చాలా మంది ఇంటికి రావాలి అనుకున్నారు. అనుకున్నదే అనువుగా ఫ్లైట్ ఎక్కేసారు. అయితే ముఖ్యమైన నటులు మొత్తం అదే ప్లైట్ ఎక్కారు. ఇందులో ఏకంగా మెుత్తం 272 మంది ఉన్నారు.

    ఈ 272 మందిలో 60 మంది సినిమా ప్రముఖులే ఉన్నారు. వారందరూ కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలే. ఇక తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అదే ఫ్లైట్ లో ఉన్నారు. నార్మల్ పర్సన్స్ దగ్గర నుంచి ప్రముఖుల వరకు ఉన్న ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ బెంబేలెత్తిపోయింది.

    ఇక ఈ ఘటన 1993 నవంబర్ 15న జరిగింది. దీని వల్ల కేవలం టాలీవుడ్ మాత్రమే.. కాదు.. యావత్ సినిమా ప్రపంచం భయపడింది. కళ్లు తెరిచేలోపు.. ఫ్లైట్.. క్రాష్ ల్యాండింగ్ అవడంతో ఏం జరుగిందో అర్థం కానీ పరిస్థితుల్లో పడ్డారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్ గా బయటపడ్డారు. కానీ ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనను ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటుంటారు. ఫ్లైట్ క్రాష్ లాండ్ పొలంలో జరిగింది. దీంతో ఎవరు ఇబ్బంది లేకుండా సేఫ్ గా బయటకు వచ్చారు.

    అయితే చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ విమానం.. ఉదయం 6 గంటల సమయంలో ప్రారంభం అయింది. విమానం గాలిలోనే ఉంది. ఓ వైపు హైదరాబాద్ లో ల్యాండింగ్ ఉంది కానీ వాతావరణం సహకరించడం లేదు. అందుకే గాల్లోనే చెక్కర్లు కొట్టింది. ఒక్కసారిగా ఇంధనం లోపం కూడా మొదలైంది. దీంతో క్రాష్ ల్యాండింగ్ చేశారు. ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు బట్టలపల్లి, గుండ్లపల్లి మధ్య ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఈ సమయంలో ల్యాండింగ్ ముందుకు లేదా వెనక్కు జరిగినా పరిస్థితి దారుణంగా ఉండేది. పొలం తడిగా ఉండటంతో ఎవరికి ఏం జరగలేదు. ఫ్లైట్ ల్యాండ్ అయిన కాస్త ముందే ఓ పెద్ద బండరాయి ఉంది. దాన్ని చూసి అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మరికాస్త ముందుకు చెరువు ఉంది. బండ, చెరువు ఈ రెండు ప్లేస్ లో ఎక్కడ ల్యాండ్ అయినా సరే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించడం కష్టమే.