Red Onions or White Onions: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత. ఉల్లిలో అన్ని ఔషధ గుణాలున్నట్లు తెలిసిందే. దీంతో ఉల్లిని ఆహారంగా తీసుకోవడానికి అందరు ఇష్టపడుతుంటారు. శాఖాహారమైనా మాంసాహారమైనా ఉల్లి ఉండాల్సిందే. లేకపోతే ఆ కూరకు మజాయే రాదు. దీంతో ఉల్లిని వాడుకుని మనం కూరలు రుచిగా చేసుకోవడం చూస్తుంటాం. ఉల్లిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే మనకు ఎన్నో రకాల వ్యాధులు దూరమయ్యే అవకాశాలు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉల్లితో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి.

ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. రక్త హీనతతో బాధపడే వారికి కూడా మంచి మందుగా మారుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా కూడా ఉల్లి దోహదపడుతుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఉల్లిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. ఉల్లితో గుజ్జును తయారు చేసుకుని ముఖానికి పట్టిస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి. దీంతో ఉల్లిని వాడటం మన ఆరోగ్యానికి మంచిదే అని తెలుసుకోవాలి.
Also Read: Prabhas Marriage: ప్రభాస్ ని పెళ్లంటే భయపడేలా చేసిన ఓ అమ్మాయి మోసం… తల్లి బయటపెట్టిన షాకింగ్ రీజన్!
ఉల్లిలో రెండు రకాలు ఉంటాయి. తెల్లవి, ఎర్రవి మార్కెట్లో మనకు కనిపిస్తాయి. ఇందులో ఏవి మంచివో తెలియని సందిగ్ధంలో కొందరు తెల్లవి కొంటే మరికొందరు మాత్రం ఎర్రవి కొనుగోలు చేస్తారు. దీంతో ఎర్ర వాటి కంటే తెల్లవాటిలోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో తెల్ల ఉల్లిని తినడంతోనే మనకు ఆరోగ్యం కలుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవాటినే తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఉల్లిని నంచుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. పచ్చి ఉల్లి ముక్కలను నమలడం ద్వారా నోట్లోని హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన రసాయనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. దీంతో ఉల్లిని వాడకంతో ఎన్నో రకాల లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు ఎన్నో విధాలుగా మేలు కలుగుతోంది. దీన్ని ఆహారంతో పాటు తీసుకుని నమలడం వల్ల ఎన్నో రోగాలు దూరమవుతాయని తెలుసుకున్నాం. అందుకే ఉల్లిని బాగా వాడుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.