Facts About Superstitions: మూఢ నమ్మకాల జాడ్యం జనాన్ని పట్టిపీడిస్తోంది. నిరంతరం ఏ పని చేయాలన్నా సరే ముహూర్తం చూసుకోనిదే చేయడం లేదు. మనిషి ఎంత తెలివి సంపాదించుకున్నా మూఢ నమ్మకాల వలలో చిక్కి బందీ అవుతున్నాడు. ఫలితంగా తన భవిష్యత్ ను పాడు చేసుకుంటున్నాడు. సాంకేతిక రంగం ఇంతలా దూసుకుపోతున్నా మనిషి మాత్రం తన మనుగడను తాను మోసం చేసుకుంటున్నాడు. అయినా అతడిలో మార్పు రావడం లేదు.

మూఢ నమ్మకాల ఊబిలో పడి అప్పుల పాలైన వారు కూడా ఉన్నారు. దీంతో దేవుళ్లు, దెయ్యాల పేరిట తమ సంపదను నష్టపోతున్నారు. రాత్రి పూట ఇల్లు ఊడవకూడదని చెబుతారు. ఎందుకంటే పూర్వం రోజుల్లో కరెంటు సదుపాయం లేకపోవడంతో ఏది కనబడదని వెలుగు ఉన్నప్పుడే ఊడ్చుకోవాలని చెప్పేవారని తెలుస్తోంది. కానీ ప్రజలు దీన్నే ఆయుధంగా చేసుకుని ఇప్పటికి కూడా పాటించడం మూఢ విశ్వాసంగా భావించాల్సిందే.
మూఢనమ్మకాలు పురోగతికి అడ్డుగా నిలుస్తున్నాయి. మనిషిలోని అంధ విశ్వాసాలు అధో పాతాళానికి పడేస్తున్నాయి. అయినా మనిషి మేల్కోవడం లేదు. తనలోని అంధత్వాన్ని దూరం చేసుకోవడం లేదు. కంప్యూటర్ కాలంలో ఎన్నో మార్గాల్లో పురోగమిస్తున్నా మనిషి మాత్రం తనలోని తెలివిని వాడుకోవడం లేదు. ఫలితంగా మూఢ నమ్మకాల వెంట పడుతున్నాడు.
Also Read: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే.. నన్ను ప్రధానమంత్రిని చేయండి.. కేఏ పాల్ కామెడీ కితకితలు..
మూఢ నమ్మకాల ప్రభావంతో మనిషి తన ఎదుగుదల ప్రమాదంలో పడిపోతోంది. ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీలను కూడా నమ్ముతూ తమ డబ్బును ఖర్చు చేస్తున్నారు. తన సంపాదనలో ఎక్కువ భాగం వీటి మీదే పెడుతూ ముందుకు వెళ్లలేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మనిషిలో మూఢత్వం పోవడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు.
ఇది చేస్తే అరిష్టం అది చేస్తే కష్టం అంటూ పనులు చేయకుండా ఉండిపోతున్నాడు. ఫలితంగా ప్రతికూల ప్రభావాలను నమ్ముతూ నట్టేట మునుగుతున్నా పట్టించుకోవడం లేదు. చదువుకున్న వారు కూడా వీటిని ఎక్కువగా నమ్మడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి మూఢ నమ్మకాల బారిన పడుతూ నష్టపోతున్నాడు. మనిషి తన మేథస్సును ఉపయోగించే ముందుకు వెళ్లాలి తప్ప ఏవో నమ్ముతూ కాదని తెలుసుకుంటేనే మంచిది.
Also Read: ఉక్రెయిన్ లో భారత విద్యార్థుల రక్షణకు అడ్డంగా నిలబడ్డ మన డాక్టర్ సాహసమిదీ!